బుర్రా కమలాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుర్రా కమలాదేవి (1908-1976 ) భారతీయ రచయిత్రి. ఆమె సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో కవితలు రచనలు చేసేరు.[1] ఆమె సాంఘికసేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్ శాసనసభ్యులు.

జీవిత విశేషాలు[మార్చు]

బుర్రా కమలాదేవి ఏప్రిల్ 13, 1908 తేదీన విశాఖపట్టణంలో జన్మించారు. ఆమె భర్త పేరు బదరీనారాయణమూర్తి. ఆమెకి ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ చేసిన వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది. ఆంధ్రా సెనేట్ లో సభ్యులుగా అనేక ప్రముఖ సంస్థలలో, కార్యక్రమాలలో పాల్గొన్నారు.

కమలాదేవిగారి మాతామహులు దివాన్ బహద్దర్ వల్లూరి జగన్నాథం పంతులు పండితుడు. మహాభాష్యాలు, బ్రహ్మసూత్రములు కందపద్యాలలో తెనిగించేరు.

భారతదేశపు జాతీయ ఉద్యమానికి సంబంధించినగీతాలు, గేయాలు వివిధ ఛందస్సులలో వ్రాసారని గిడుగు వెంకట సీతాపతి రాసారు. ఆమె రాసిన అనేక రచనలలో విషాదము ప్రధానరసము అని అంటారు సీతాపతి. 60వ దశకంలో (సీతాపతిగారు తమపుస్తకం ప్రచురించేసమయంలో) కమలాదేవి ఋగ్వేదములోని కొన్ని శ్లోకాలను తెలుగులోనికి అనువదించే కార్యక్రమం చేపట్టేరుట.[1]

రచనలు[2][మార్చు]

  • శ్రీ వైశాఖ వేంకటప్రభూదయం
  • ఛందోహంసి (రెండు భాగాలు)
  • అనుష్టుప్పు
  • నిగమాంతర కవితోపమలు
  • మందాక్రాంత కవితాశ్రవంతి
  • సామగానప్రియోదాహరణము (1963)[3]
  • సుమలత[4]

కవితలు[మార్చు]

  1. అడవిమల్లె
  2. ఘనజీవితము
  3. మ్లానవదన
  4. అళిమిధునము
  5. తొలకరి
  6. కాంక్ష, కొలువు
  7. ప్రాంజలి
  8. పురిటిపాప
  9. కృశాబ్దము
  10. శారదాగమనము
  11. నిద్రా దేవి ...మొదలైనవి..

ఖండ కావ్యాలు[మార్చు]

  1. సుమమాల
  2. భావలహరి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 మాలతి, రచయిత (2017-12-29). "విదుషి బుఱ్ఱా కమలాదేవిగారు". తెలుగు తూలిక. Retrieved 2020-06-18.
  2. "హెరాల్డ్ బర్త్ డే : 13-04-2020 రోజున జన్మించిన ప్రముఖులు..? - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-06-18.
  3. Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-260-1221-3.
  4. "Google Groups". groups.google.com. Retrieved 2020-06-18.