Jump to content

బులా చౌదరి

వికీపీడియా నుండి
బులా చౌదరి
Personal information
Full nameబులా చౌదరి
Nationalityభారతీయులు
Bornకలకత్తా
Sport
SportSwimming

బులా చౌదరి (ఆంగ్లం: Bula Chowdhury; జననం 1970 జనవరి 2), సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి భారతీయ మహిళ. ఆమె భారతదేశంలో జాతీయ మహిళా ఈత ఛాంపియన్ గా నిలిచింది. ఆమె 1989, 1999లలో "ఇంగ్లీషు ఛానెల్" ను రెండుసార్లు ఈది చరిత్ర సృష్టించింది. ఆమెకు 1990లో అర్జున అవార్డు వచ్చింది. ఆమె కోల్‌కతాలో ఒక స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పడానికి పథకం రచిస్తున్నది. ఆమె పశ్చిమ బెంగాల్ లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నందన్‌పూర్ నియోజకవర్గం నుండి కమ్యూనిస్ట్ పార్ట్(మార్క్సిస్టు) తరపున లెజిస్లేచర్ గా ఎన్నికైంది.

ఆమె ప్రతిభావంతురాలైన అధిక దూరాలను ఈదే భారతీయ స్విమ్మర్, ఆమె పోటీ ప్రపంచంలో తన స్థానాన్ని నిలబట్టుకున్నది. ఆమె తన 9వ యేట స్విమ్మింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి వివిధ పోటీలలో ఆరు బంగారు పతకాలను సాధించింది.[1] ఆమె తన 24వ యేట అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 2004లో శ్రీలంక నుండి ధనుష్కోటి వరకు పాక్ జలసంధిని 14 గంటలలో ఈదగలిగింది. ఆమె ఐదు ఖండాలలో ఏడు సముద్రాలను ఈదిన మొదటి మహిళగా చరిత్రలో నిలిచింది.

ముఖ్య విజయాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

ఆమె 1989లో ఇంగ్లీషు ఛానెల్ ని దాటింది. 1999లో రెండవసారి ఇంగ్లీషు చానెల్ ను ఈది గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రెండుసార్లు ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన మొదటి ఆసియా మహిళగా చరిత్రను సృష్టించింది. 1990లో ఆమెకు అర్జున అవార్డు లభించింది. 2000లో ఆమె జిబ్రాల్టర్ జలసంధిని దాటింది. ఆ తర్వాత, ఆమె ఇటలీలోని తిరేనియన్ సముద్రాన్ని దాటింది. ఆ తర్వాత, ఆమె 2003లో యూ.ఎస్. లోని కటాలినా ఛానెల్ ను, గల్ఫ్ లోని టొరోనియస్ ను ఈది విజేతగా నిలిచింది. ఆమె న్యూజిలాండ్ లోని కుక్స్ స్ట్రైట్స్ ను సైతం ఆమె ఈదగలిగింది. ఆమె జిబ్రాల్టర్ జలసంధిని 3 గంటల 35 నిముషాలలో ఈది ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఆమెను భారతప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 1993లో సంజిబ్ చక్రవర్తిని వివాహమాడింది. వారికి ఒక కుమారుడు సరబ్‌జిత్ ఉన్నాడు. కలకత్తాలో స్విమ్మింగ్ అకాడమీ నెలకొల్పాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.

మూలాలు

[మార్చు]
  1. ఐ లవ్ ఇండియా[permanent dead link]
  2. "Swimmer Bula Chowdhury: దొంగలు పతకాలు ఎత్తుకెళ్లారు". EENADU. Retrieved 2025-08-17.

ఇతర మూలాలు

[మార్చు]