బులుసు పాపయ్య శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బులుసు పాపయ్య శాస్త్రి సంస్కృత పండితుడు, లౌక్యుడు.[1] బులుసు పాపయ్య శాస్త్రి గారు తూర్పు గోదావరి జిల్లా లోని అమలాపురం దగ్గర కల అయినవిల్లి[2] గ్రామ వాస్తవ్యులు.రమారమి 1939 ప్రాంతంలో పుట్టినవారు. వీరు బులుసు అచ్చయ్య శాస్త్రి గారు కుమారుడు. తండ్రి కుమారులు ఇరువురూ ప్రముఖంగా సంస్కృత పండితులు. వీరి భార్య శ్రీమతి బంగారమ్మ, కుమారుడు  శ్రీ అచ్యుత శాస్త్రి.[3]

జీవిత విశేషాలు[మార్చు]

ఇతని తండ్రి బులుసు అచ్చయ్యశాస్త్రి పిండిప్రోలు లక్ష్మణకవి కి సమకాలీనుడు..[4] అతను పిఠాపురం సంస్థాన ప్రభువగు లావు వేంకటపతి గంగాధర రామారావు బహద్దర్ ఆస్థానంలో పండితులుగా ఉండేవాడు. జమీందారు అతనికి ఒక గ్రామంలో పదిపుట్ల నేలను వాగ్దానం చేసాడు. ఒక పుట్టి అంటే 12 ఎకరాలు. భూమి ఇమ్మని జమీందారు ధానేదారుకు హుకుం ఇచ్చాడు. అప్పుడు ధానేదారుగా దుగ్గిరాల పల్లంరాజు ఉన్నాడు. అతను బాలాంత్రపు రజనీకాంతరావు తల్లికి మేనమామ. పాపయ్య ఇతని దగ్గరకి వెళ్ళి, ఈ మాటా ఆ మాటా చెప్పి 180 ఎకరాలు కొలిపించుకున్నాడు. ఈ విషయం జమీందారుకు తెలిసింది. ధానేదారును భర్తరఫ్ చేసాడు.

వెంటనే పాపయ్య జమీందారు దగ్గరికి వెళ్ళి "మీ దానం వెనక్కి తీసుకోండి, ఆయన్ని శిక్షించారు కదా, నాకు భూమి వద్దు" అని చెబుతాడు.

"నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు కనుక అతనిని తొలగించాను" అని జమీదారు చెబుతాడు.

"నాకు ఏ భాషలో పాండిత్యం ఉందని మీరు నాకు దానం ఇచ్చారు?" అని అడిగాడు పాపయ్య.

"సంస్కృతం" అని సమాధానమిచ్చాడు జమీదారు. "సంస్కృతం దేవ భాషా? మానవ భాషా?" అని అడిగాడు పాపయ్య. దానికి జమీందారు 'దేవభాష" అని బదులిచ్చాడు.

"మరి దేవతలకూ మానవులకూ కొలమానంలో తేడా ఉంటుంది కదా. మనుషుల లెక్కకు దేవతలది అర రెట్టు ఎక్కువ. దేవబాషలో ఇచ్చారు కనుక నేను 120ని 180 చేసాను" అని పాపయ్య వివరిస్తాడు.

అతని గడుసుతనానికి మెచ్చి తొలగించిన థానేదారును తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నాడు జమీదారు.[5]

రచనలు[మార్చు]

  • ‘విక్రమదేవ వర్మ మహా రాజీయం’[6]

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్ర రచయితలు/పరవస్తు వేంకట రంగాచార్యులు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-05-30.
  2. "Read the eBook Gódávari (Volume 1) by Madras (India : State) online for free (page 23 of 33)". www.ebooksread.com. Archived from the original on 2022-03-30. Retrieved 2022-03-30.
  3. "Papayya Satry Bulusu". geni_family_tree. Retrieved 2022-03-30.
  4. "కవి జీవితములు/పిండిప్రోలు లక్ష్మణకవి - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-05-30.
  5. "Pratilipi | Read Stories, Poems and Books". telugu.pratilipi.com. Retrieved 2020-05-30.
  6. "విక్రమదేవ అభినవ కృష్ణమదేవ". www.teluguvelugu.in. Retrieved 2020-05-30.[permanent dead link]