బెంగాలీ అక్షరమాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగ్లా లిపి

బెంగాలీ లేక బంగ్లా అక్షరమాల (బంగ్లా భాష: বাংলা বর্ণমালা, బంగ్లా బొర్నొమాల) లేక బెంగాలీ లిపి (బంగ్లా భాష: বাংলা লিপি, బంగ్లా లిపి) అనునది భారత ఉపఖండము లోని బెంగాలీ (బంగ్లా) భాషని రాయు విధానము. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించు ఆరవ అతి విస్తృతమైన లిపి. ఈ లిపిని బిష్ణుప్రియ మణిపురి వంటి ఇతర భారతీయ భాషలను రాసేందుకు కూడా వాడతారు, అలాగే చారిత్రక దృక్పథం లో బెంగాలీ లోన సంస్కృతం రాసేందుకీ వాడేవారు. ఈ లిపిలో మొత్తం 50 అక్షరాలు ఉన్నాయి, అందులో 11 అచ్చులూ, 39 హల్లులూ కలవు.

లిపులలో రకాలని బట్టి చూసినపుడు బెంగాలీ లిపి అబుజిద అనే రకానికి చెందుతుంది, అనగా ఈ లిపిలో అచ్చులు అనునవి తమ సంజ్ఞలను అక్షరానికి కలపడాం ద్వారా రాయబడతాయి. బెంగాలీ లిపి ని ఎడమ నించి కుడికి రాస్తారు. ఇందులో అక్షరాలకు వ్యాకరణ సంబంధిత మార్పులు ఉండవు. ఇతర బ్రహ్మీ లిపుల లో వలెనే ఈ లిపిలోనూ মাত্রা అనబడు ఒక సమాంతర రేఖ ఉంటుంది, ఇది అక్షరాల పై భాగాలను కలుపుతూ ఉంటుంది. బెంగాలీ లిపి మూలలతో కూడి ఉండక సుతారమైన వంపులతో కూడి ఉంటుంది.