Jump to content

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

అక్షాంశ రేఖాంశాలు: 13°12′25″N 077°42′15″E / 13.20694°N 77.70417°E / 13.20694; 77.70417
వికీపీడియా నుండి
(బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దారిమార్పు చెందింది)
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంసార్వజనికం
యజమాని/కార్యనిర్వాహకుడుబెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్
జివికె గ్రూపు[1]
సేవలుబెంగళూరు
ప్రదేశందేవనహళ్ళి, కర్ణాటక, భారతదేశం
ప్రారంభం24 మే 2008
ఎయిర్ హబ్
ఎత్తు AMSL915 m / 3,002 ft
అక్షాంశరేఖాంశాలు13°12′25″N 077°42′15″E / 13.20694°N 77.70417°E / 13.20694; 77.70417
వెబ్‌సైటుwww.bengaluruairport.com
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
09/27 4,000 13,123 తారు
గణాంకాలు (ఏప్రిల్ '13 – మార్చి '14)
ప్రయాణీకుల సంఖ్య1,28,68,830
విమానాల సంఖ్య1,17,728
సరుకు రవాణా టన్నులలో2,42,391

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగుళూరులో గల అంతర్జాతీయ విమానాశ్రయము.

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎగురుతున్న జాతీయపతాకం

2008, మే 23వ తేదీన కర్ణాటక రాష్ట్రపు మొట్టమొదటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ప్రారంభించబడింది. బెంగళూరు నగరం నుండి సుమారు 32 కి.మీ.దూరంలో ఉన్న ఈ విమానాశ్రయానికి రహదారి మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. "హైస్పీడ్ రైలు", "ఎక్స్‌ప్రెస్ వే" మార్గాల బ్లూప్రింట్ తయారు చేయబడింది. టాక్సీ సౌకర్యం, ప్రతి 15 నిమిషాలకొక కె.ఎస్.ఆర్.టి.సి.బస్ సౌకర్యం ఏర్పాటు చేయబడింది. బెంగళూరు ఏ మూల నుండి ఐనా గంట, గంటన్నరలోపు విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రయాణీకుల సౌకర్యం కొరకు "బి.ఐ.ఎ.ఎల్ సహాయవాణి" సౌలభ్యం ఉంది. సహాయవాణి సంఖ్య:40581111 ద్వారా విమానాశ్రయానికి రవాణా సౌకర్యాల వివరాలు, ఇతర సాధారణ విషయాలు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. విమానాశ్రయంలో 53 చెక్-ఇన్ కౌంటర్లు, 18 స్వయం పరిశీలన యంత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. పిల్లల సౌకర్యం కొరకు ఔషధాలయం, డయాపర్లు మార్చుటకు, పిల్లలకు పాలుత్రాగించడానికి ప్రత్యేక స్థలాలు ఉన్నాయి.


మూలాలు

[మార్చు]
  1. "GVK | Our Business – Airports – GVK KIA Bengaluru". Archived from the original on 2014-10-13. Retrieved 2014-11-26.
  2. "March 2013 Traffic Statistics" (PDF). Archived from the original (PDF) on 2014-06-06. Retrieved 2014-11-26.
  3. "Airports Authority of India". Aai.aero. Archived from the original on 17 జూన్ 2014. Retrieved 22 October 2013.

బయటి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.