బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెసెంట్ థియొసాఫికల్ కాలేజ్
బెసెంట్ దివ్యజ్ఞాన కళాశాల
Besant theosophical college.jpg
ఇతర పేర్లు
బి.టి.కాలేజి
పూర్వపు నామము
వుడ్ నేషనల్ కాలేజ్
నినాదంEducation as Service
రకంప్రైవేటు
స్థాపితం1917; 104 సంవత్సరాల క్రితం (1917)
అనుబంధ సంస్థశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
చిరునామగిరిరావు స్ట్రీట్, బెంగళూరు రోడ్డు, మదనపల్లె, ఆంధ్రప్రదేశ్, 517325, భారతదేశం
కాంపస్గ్రామీణ
జాలగూడుbtcollege.org

బెసెంట్ థియొసాఫికల్ కాలేజి (దివ్యజ్ఞాన కళాశాల) - దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.అనీ బిసెంట్ స్థాపించారు. మద్రాసు (చెన్నై) లోగల 'బిసెంట్ థియోసాఫికల్ సొసైటీ' చే స్థాపింపబడి నడుపబడుతోంది. మదనపల్లె పట్టణంలో చారిత్రక కళాశాల. బి.టి. కాలేజిగా ప్రసిధ్ధి.

చరిత్ర[మార్చు]

ఈ కళాశాల రాయలసీమ విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రజా ఉద్యమాలకు, స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తిని అందించిన గొప్ప వేదికగా ఈ కళాశాలను పేర్కొనవచ్చు. దివ్యజ్ఞాన సమాజం ప్రచారానికి అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ దురాగతాలు, భారతీయుల పేదరికం, నిరక్షరాస్యతను చూసి ఆమె చలించిపోయింది. స్వాతంత్ర్యం కోసం పోరాడాలని ఆమె నిర్ణయించుకుని హోంరూల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. దివ్యజ్ఞాన సమాజం తరఫున పాఠశాల స్థాపన కోసం ఆమె చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చింది. ఈ ప్రాంతంలో విద్యావ్యాప్తికి అనిబిసెంట్ చేసిన సేవలు మరువలేనివి. ఈమె రాయలసీమలో మొట్టమొదటి దివ్యజ్ఞాన కళాశాలను 1915, జూలై 19న స్థాపించింది[1], [2] . మొదట ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. ఈ కళాశాల కేంద్రంగా అనిబిసెంట్ హోమ్‌రూల్ ఉద్యమాన్ని నడిపింది. ఈ ఉద్యమం నడుపుతున్నందుకు ఆమెను బ్రిటిష్ ప్రభుత్వం ఊటీలో అరెస్ట్ చేసింది. దానికి నిరసనగా మదనపల్లెలో కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇది జాతీయోద్యమంలో విద్యార్థులు నేరుగా పాల్గొన్న మొదటి సంఘటన. అనిబిసెంట్‌ను ఆ తర్వాత విడుదల చేసినప్పటికీ కళాశాలను మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తొలగించారు. దీనికి వెరువక అనిబిసెంట్ కళాశాల పేరును ఉడ్ నేషనల్ కాలేజీ అని పేరు మార్చి మద్రాసులో ఆమె స్థాపించిన నేషనల్ యూనివర్సిటీకి అనుబంధంగా చేర్చింది. ఆ యూనివర్సిటీకి రవీంద్రనాధ టాగూరు ఛాన్స్‌లర్‌గా వ్యవహరించాడు.

1919లో రవీంద్రనాథ్ టాగూరు ఈ కళాశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా ఇతడు ఇక్కడ జనగణమన అనే గేయాన్ని బెంగాలీ భాష నుండి ఇంగ్లీషులోనికి అనువదించాడు. ఈ గేయానికి కళాశాల ప్రిన్సిపాల్, ఐరిష్ కవి జేమ్స్ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ బాణీను కూర్చింది. ఆ విధంగా ప్రస్తుతం మనం ఆలపించే రీతిలో జాతీయగీతం ఈ కళాశాల నుండే పాడటం ప్రారంభమయ్యింది[3] .

1927లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత ఈ కళాశాల ఆ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారింది. కానీ 1929లో అధికార పరిధి పునర్విభజన కారణంగా ఈ కళాశాల మళ్ళీ మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోనికి వచ్చింది. 1956నుండి ఈ కళాశాల తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచెస్తున్నది.

ఈ కళాశాలను సందర్శించిన ప్రముఖులలో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ, కమలాదేవి ఛటోపాధ్యాయ, సరోజినీ నాయుడు, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబూ రాజేంద్రప్రసాద్, వి.వి.గిరి, సి.వి.రామన్, సి.పి.రామస్వామి అయ్యర్, మీర్జా ఇస్మాయిల్, టంగుటూరి ప్రకాశం మొదలైన వారున్నారు.

పూర్వవిద్యార్థులు[మార్చు]

పూర్వ అధ్యాపకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. విలేకరి (14 July 2014). "మదనపల్లె బిటి కళాశాలకు వందేళ్లు" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Retrieved 21 June 2020. CS1 maint: discouraged parameter (link)
  2. https://www.thehindu.com/features/friday-review/a-historic-journey/article6245726.ece
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-19. Retrieved 2020-06-21.

బయటి లింకులు[మార్చు]