బైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైట్ అనగా కంప్యూటర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికర సమాచార పరిమాణం యొక్క కొలత ప్రమాణం. టైపు చేయబడిన ఒంటి అక్షరం (ఉదాహరణకు, 'x' లేదా '8') కొలత ఒక బైట్. సింగిల్ బైట్ సాధారణంగా ఎనిమిది బిట్స్ (బిట్స్ అనేవి క్రమంగా ఉండే కంప్యూటర్లోని నిల్వ యొక్క అతిచిన్న యూనిట్, అర్థమయ్యేలా చెప్పాలంటే పదార్థం కోసం అణువులుగా) లను కలిగి ఉంటుంది. బైట్లు తరచూ B అక్షరం ద్వారా సూచించబడతాయి. చారిత్రాత్మకంగా, బైట్లు పాఠ్య అక్షరాలు ఎన్కోడ్ చెయ్యటానికి ఉపయోగిస్తారు.

వాడకం[మార్చు]

చాలా ప్రోగ్రామింగ్ భాషల్లో బైట్ అనే డేటాటైపు ఉంది. సీ, సీ++ భాషల్లో ఒక బైట్ అంటే ఒక అక్షరాన్ని సూచించడానికి సరిపడే పరిమాణం కలిగిన మెమరీ లొకేషన్. ప్రామాణికత ప్రకారం ఒక బైట్ లో కనీసం 256 విలువలు భద్రపరచగలగాలి. అంటే కనీసం ఎనిమిది బిట్లు పరిమాణం ఉండాలి.

జావాలో బైట్ డేటాటైపు కచ్చితంగా ఎనిమిది బిట్లు ఉండాలి. అందులో ఒక బిట్ ను విలువ ధనాత్మకమా, ఋణాత్మకమా అని సూచించడానికి మిగతా వాటిని విలువను సూచించడానికి వాడతారు. అంటే జావాలో ఒక బైటు −128 నుంచి 127 సంఖ్యలను సూచిస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=బైట్&oldid=3014600" నుండి వెలికితీశారు