బొప్పన సత్యనారాయణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీ.ఎస్‌.రావు
జననం
బొప్పన సత్యనారాయణరావు

1948
విద్యాసంస్థఎంబీబీఎస్‌
వృత్తిడాక్టర్, విద్యావేత్త
జీవిత భాగస్వామి
ఝాన్సీలక్ష్మీ భాయి
(m. 1970)
పిల్లలుసీమ, సుష్మ

బొప్పన సత్యనారాయణ రావు (బీఎస్‌రావు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యావేత్త.  ఆయన 1986లో విజయవాడ పోరంకిలో శ్రీచైతన్య బాలికల జూనియర్‌ కాలేజీని స్థాపించడంతో శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రస్థానం మొదలై, 2023 నాటికీ 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్ఈ స్కూల్స్‌ద్వారా దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థుల విద్యనభ్యసిస్తున్నారు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

బీఎస్‌రావు 1948లో 1948 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం, అంగలూరు, గ్రామంలో బొప్పన నాగభూషణం, జానమ్మ దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు. ఆయన ఎస్‌ఎస్సి పూర్తి చేసి, విజయవాడ లయోలా కాలేజీలో పీయూసీ, గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసి లండన్‌లో ఎం.ఆర్‌.ఎస్.హెచ్‌ పూర్తి చేసి అక్కడే వైద్యవృత్తిని చేపట్టాడు.

విద్యావేత్తగా[మార్చు]

బీఎస్‌రావు ఇంగ్లండ్‌, ఇరాన్‌ దేశాల్లో 15ఏళ్లపాటు వైద్యసేవలందించి తిరిగి 1985లో స్వదేశానికి వచ్చాడు. బీఎస్‌ రావు దంపతులు తమ కుమార్తెలను విజయవాడలో మంచి కాలేజీలో చదివించాలన్న ఆలోచనతో కాలేజీల కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఆయన 1986లో విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాలను ( శ్రీచైతన్య విద్యాసంస్థ) ను స్థాపించాడు. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో ప్రారంభించి తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు, 1995 నుండి ఈ విద్యాసంస్థ విస్తరించటం ప్రారంభించి ఎంసెట్‌కు కోచింగ్‌కు కేరాఫ్‌గా మరి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు దాటి 2004 నుంచి ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో నూతన బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి.

2006 నుంచి ఐఐటీ -జేఈఈ, ఏఐఈఈఈ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటు చేశాడు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన లక్షలాది మంది ఇంజినీర్లుగా,డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. 2023 నాటికీ దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి.

మరణం[మార్చు]

డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు గుండెపోటుకు గురై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2023 జులై 13న మరణించాడు.[1] ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మీభాయి, ఇద్దరు కూతుళ్లు సీమ, సుష్మ ఉన్నారు. డాక్టర్‌ బీఎస్‌ రావు కుమారుడు కళ్యాణ్‌ చక్రవర్తి 16ఏళ్ల ప్రాయంలో మరణించాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Eenadu (14 July 2023). "శ్రీచైతన్య అధినేత బి.ఎస్‌.రావు కన్నుమూత". Archived from the original on 14 జూలై 2023. Retrieved 14 July 2023.
  2. Andhra Jyothy (14 July 2023). "శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ బీఎస్‌రావు హఠాన్మరణం". Archived from the original on 14 జూలై 2023. Retrieved 14 July 2023.
  3. Namasthe Telangana (14 July 2023). "'శ్రీచైతన్య' ఫౌండర్‌ బీఎస్‌రావు కన్నుమూత". Archived from the original on 16 July 2023. Retrieved 16 July 2023.