బ్రహ్మ జెముడు
(బ్రహ్మజముడు నుండి దారిమార్పు చెందింది)
బ్రహ్మజెముడు ఔషధ మొక్క. ఇది నీటి ఎద్దడిని తట్టుకుని ఇసుక నేలల్లో 10 నుంచి 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
సాధారణంగా వీటిని ఎడారి మొక్కలు అంటారు. ఇవి నీటిని తమ కాండంలో నిల్వ వుంచుకునే శక్తి గలవి.
ఈ మొక్కలకు ముళ్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన వ్యవసాయ పంట రక్షణ కొరకు వీటిని పొలం చుట్టూ కంచెగా పెంచుతారు.
ఆయుర్వేదం
[మార్చు]మంచి పసుపు కొమ్ములను బ్రహ్మ జెముడు చెట్టు మొదట్లో గుచ్చి 3 రోజులు నానబెట్టి తరువాత ఎండ బెట్టాలి.మల్లి బ్రహ్మజెముడు మొదట్లో గుచ్చి 3 రోజులు ఉంచి తీసి ఎండా బెట్టాలి.
ఇలా 7సార్లు చేసిన తరువాత ఆ పసుపు కొమ్ము ను నీటితో అరగ తీసి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ ఉంటె బొల్లి ,మేహపోడల మచ్చలు , ఇంకా సకల చర్మ వ్యాధులు పోతాయి.
సామెతలు
[మార్చు]గోవు పాలు వదలి బ్రహ్మ జెముడు పాల కోసం వెళ్లినట్లు