బ్రహ్మ వైవర్త పురాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రహ్మ వైవర్త పురాణం ఓ సంస్కృత ఉద్గ్రంథం. హిందూ మతానికి చెందిన ప్రధాన పురాణం. [1] ఇది కృష్ణుడు రాధల గురించిన వైష్ణవ గ్రంథం. ఆధునిక యుగ పురాణాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. [2] [3] [4]

1 వ సహస్రాబ్ది చివరలో ఈ పురాణం యొక్క ఒక కూర్పు ఉనికిలో ఉన్నప్పటికీ, దాని ప్రస్తుత కూర్పు మాత్రం 15 లేదా 16 వ శతాబ్దంలో బెంగాల్ ప్రాంతంలో రచించి ఉండవచ్చునని భావిస్తున్నారు. [1] [2] [3] ఈ పేరుతో పోలి ఉండే బ్రహ్మకైవర్త పురాణం అనే శీర్షికతో మరొక వచనం కూడా ఉంది. అది దీనికి సంబంధించినదే. దీన్ని దక్షిణ భారతదేశంలో రచించారు. [2] ఈ పురాణం 274 లేదా 276 అధ్యాయాలలో, అనేక కూర్పులు ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మవైవర్త పురాణం లేదా బ్రహ్మకైవర్త పురాణం లోని భాగమేనని చెప్పుకుంటారు. [5]

కృష్ణుడిని సర్వోన్నత వాస్తవికతగా గుర్తించడం, విష్ణు, శివుడు, బ్రహ్మ, గణేశుడు వంటి దేవతలందరూ ఒకటేనని, అందరూ కృష్ణుడి అవతారాలేననీ ఈ పురాణం వక్కాణిస్తుంది. [6] అలాగే రాధ, దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి వంటి దేవతలందరూ కూడా ఒక్కరేననీ, అందరూ ప్రకృతి అవతారాలేననీ కూడా చెబుతుంది. [7] ఈ పురాణం స్త్రీకి ఉన్నత స్థానం కలిప్స్తుంది. మహిళలందరూ దివ్య స్త్రీ మూర్తి రూపాలేనని, విశ్వానికి సహ సృష్టికర్త అనీ, స్త్రీకి జరిగే అవమానం దేవత రాధకు జరిగినట్లేననీ ఈ పురాణం వచిస్తుంది. [2] [8]

భాగవత పురాణంతో పాటు బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ-సంబంధిత హిందూ సంప్రదాయాలపైన, అలాగే రాసలీల వంటి నృత్య ప్రదర్శన కళలపై కూడా ప్రభావం చూపాయి. [9] [10] [11]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Dalal 2014, p. 83.
 2. 2.0 2.1 2.2 2.3 Rocher 1986, p. 163.
 3. 3.0 3.1 Hazra 1940, p. 166.
 4. Monier Monier-Williams, Sanskrit English Dictionary with Etymology, Oxford University Press (Reprinted by Motilal Banarsidass), Article on Brahmavaivarta, page 740, Online archive
 5. Rocher 1986, pp. 161, 163-164.
 6. Rocher 1986, pp. 161, 163.
 7. Rocher 1986, pp. 161-162.
 8. K P Gietz 1992, pp. 248-249 with note 1351.
 9. Rocher 1986, pp. 161-163.
 10. Kinsley 1979, pp. 112-117.
 11. Farley P. Richmond; Darius L. Swann; Phillip B. Zarrilli (1993). Indian Theatre: Traditions of Performance. Motilal Banarsidass. pp. 177–181. ISBN 978-81-208-0981-9.

1. డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).