బ్రాంప్టన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రాంప్టన్ కెనడాలోని సదరన్ ఒటారియా నగరం.ఇది టొరంటో మహానగరం యొక్క సరిహద్దు నగరం. 2011 గణాంకాలను అనుసరించి బ్రాంప్టన్ జనసంఖ్య 5,23,911. 1853లో బ్రాంప్టన్ ఒక గ్రామంగా మొదలైంది. బ్రాంప్టన్ అనే పేరు ఇంగ్లాండ్ లోని సుదూర ప్రాంతం అయిన కంబ్రియా నగరానికి చెందిన చిన్న ఊరైన బ్రాంప్టన్ నుండి వచ్చింది. బ్రాంప్టన్ ఒకప్పుడు కెనడా పూల ఊరుగా (ఫ్లవర్ టౌన్) గా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ బృహత్తరమైన గ్రిన్ హౌస్ పరిశ్రమ ఉండడమే ఇందుకు కారణం. బ్రాంప్టన్ నగర ఆదాయవనరులుగా ఆధునిక తయారీలు, సేవారంగం, సమాచారం, సాంకేతికత, ఆహారం, పనీయాల ఉత్పత్తి, లైఫ్ సైంసెస్, వాణిజ్య సేవలు.

నగర చరిత్ర

[మార్చు]

1834 లో ప్రస్తుతపు మెయిన్, క్వీన్ స్ట్రీట్ లోవిలియమ్ బఫీస్ టావర్న్ పేరుతో నడపబడిన భవనం మాత్రమే ప్రస్తుతపు బ్రాంప్టన్‌కి కేంద్రం.ఈ ప్రాంతం బఫీస్ కార్నర్‌గా గుర్తింప బడింది.1834 లో జాన్ ఎలియాట్ ఇక్కడ్ బ్రాంప్టన్ పేరుతో ఇళ్ళ స్థలాలు రూపొందించి విక్రయించడంతోఈ ప్రాంతం ప్రజలలో బ్రాంప్టన్ గా స్థిరపడి పోయింది.
1854 లో అప్పుట్లో నూతనంగా స్థాపించబడిన కంట్రీ అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ ది కంట్రీ ఆఫ్ పీల్ వ్యవసాయ ఉత్పత్తుల సంతను మెయిన్, క్వీన్ స్ట్రీట్ మూలలో ఏర్పాటు చేశారు.వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యాలు, దుంపలూ, పాల ఉత్పత్తులు ఇక్కడ అమ్మకానికి వచ్చాయి.ప్రస్తుతం జరుగుతున్న బ్రాంప్టన్స్ ఫార్మర్ మార్కెట్కి ఇది ప్రారంభం.తరువాతి కాలలంలో ఇక్కడ గుర్రాలు, పెంపుడు జంతువులు, స్వల్పంగా ఇతర జంతువులు విక్రయానికి రావడం ప్రారంభం అయింది.ఆ వ్యవశాయ ఉత్పత్తుల సంత చివరికి ప్రస్తుత ఆధినిక బ్రాంప్టన్ ఫాల్ ఫైర్‌గారూపాంతరం చెందింది.అదే సంవత్సరం బ్రాంప్టన్ విలేజ్ జాబితాలోకి చేరింది.
1887లో ఫెడరల్ ప్రభుత్వం ఈ విలేజ్ మొట్టమొదటి ఉచిత గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి నిధులను విడుదల చేసింది.1907లో స్టీల్ వ్యాపారంలో అగ్రగణ్యుడైన ఆన్‌డ్ర్యూ కార్నెగీ నుండి నిదులను సేకరించి అనేకమంది చదవడానికి వసతి కల్పించేలా బ్రాంప్టన్ లైబ్రెరీ భవననిర్మాణం చేపట్టింది.
బ్రాంప్టన్ వ్యవసాయులు కొంతమంది నగరంలో పనిచేస్తున్న బీమా ఆఫీసుల నుండి పాలసీలు పొందడానికి సమస్యలు తలెత్తడంతో క్లైర్ విల్లే హాల్ లో పలు సమావేశాలు జరిపి ది కంట్రీ ఆఫ్ పీల్ ఫార్మర్స్ ముచ్యుయల్ ఫైర్ పేరుతో బీమా సంస్థను స్థాపించలని నిశ్చయానికి వచ్చారు.1955లో ఈ సంస్థ మూడవ సారి స్థల మార్పిడి చేసి 103 క్వీన్ స్ట్రీట్ వెస్ట్ కి మార్చి తన పేరుని పీల్ ముచ్యుయెల్ ఇన్సూరెన్స్ కంపనీగా మార్చుకుంది.ఇది బ్రాంప్టన్ నగరంలోని అత్యంత పురాతన స్తంస్థ.1890 లో హార్మ్స్‌వర్త్ డెకరేటింగ్ సెంటర్ హార్మ్స్ వర్త్ ‍‍‍‍అండ్ సన్ పేరుతో స్థాపించబడింది.ఇది మొదట వారి ఇంటి ముందరి భాగంలో ప్రారంభించారు.పాత భవనం మంటలకు గురి కావడంతో 1904 సెప్టెంబరు 1లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రదేశాన్ని $1400 డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది అత్యంత అధిక కాలంగా బ్రాంప్టన్లో పనిచేస్తూ ఉన్న చిల్లర సామానుల దుకాణం.

ఇంగ్లాండ్కు లోని డార్కింగ్ నుండి వచ్చి స్థిరపడిన ఎడ్వర్డ్ డేల్ బ్రాంప్టన్ నగరంలో పూలమొక్కల నర్సరీ స్థాపించాడు. క్రమంగా డేల్స్ నర్సరీ నగరంలో అతి పెద్ద నర్సరీగా మారింది. అలాగే ఉపాధి కల్పాలో కూడా ప్రముఖమైనది. పూలను నాణ్యానుసారం విభజించడం వంటివి ప్రవేశపెట్టి అంతర్జాతీయ వాణిజ్యంలో అడుగుపెట్టి తన ఇత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. 1977లో టౌన్ కౌంసిల్ దానిని పడగొట్టమని ఆదేశించే వరకు ఈ సంస్థ చిమ్నీ ప్రముఖ నగరచిహ్నంగా ఉంటూ వచ్చింది. ఈ సంస్థకు 140 గ్రీన్ హౌసులు ఉన్నాయి.ఉత్తరామెరికా అతి పెద్ద పూలకత్తిరింపు వ్యాపారం కలిగి ఉంది. ఇది మార్కెట్లో 2 కోట్ల పూలమొగ్గలను ప్రవేశపెట్టి పలు గులాబీ జాతులను, ఆర్చిడ్ జాతులను మార్కెటుకు తీసుకు వచ్చాడు. ఈ సంస్థ నగరంలో ఇతర నర్సరీలను ప్రోత్సహించింది. ఒకప్పుడు నగరంలో 48 హాట్‌హౌస్ నర్సరీలు ఉండేవి. 1963లో బ్రాంప్టన్ ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించింది. తరువాత తనతాను బ్రాంప్టన్‌ను కెనడా పూలనగరంగా వర్ణించింది. 2004 జూన్ 24 న నగర కౌంసిల్ బ్రాంప్టన్ పూలౌత్పత్తి వారసత్వాన్ని గుర్తించి బ్రాంప్టన్‌ను పూలనగరంగా ప్రకటించింది. రోజ్ ధియేటర్ నిర్మాణం తరువాత ధియేటర్ నిర్వహణలో భాగంగా కమ్యూనిటీల నడుమ రోజు పూవుల అమరికలో పోటీలు నిర్వహించబడుతున్నాయి. 57 మిల్ స్ట్రీటులో ఉన్న ది ఓల్డ్ షూ కంపెనీ " స్థానంలో ఒకప్పుడు హ్యూస్టన్ షూ కంపెనీ ప్రధాన కార్యాలయం ఉంటూ వచ్చింది. ఉంటూ వచ్చింది. 2008 లో ఒంటారియా వారసత్వ చట్టం అమలైన తరువాత దీనిని చాత్రిక వారసత్వ సంపదగా సంరక్షించబడుతుంది. ప్రస్థుతం ఇక్కడ చిన్న చిన్న వ్యాపార సంస్థలున్నాయి. అయినప్పటికీ హాలు, లాబీల గోడలు బ్రాంప్టన్ చరిత్రకు సంబంధించిన చిత్రాలు, షూ తయారీలో ఉపకరించే ఉపకరణలతో అలనరించబడిఉన్నాయి. అంతర్జాలంలో, బ్రాంప్టన్ సిటీ హాల్ లలో " చారిత్రాత్మక పయనం " అనే పేరుతో ఒక ప్రదర్శన అందుబాటులో ఉంది.

టొరంటోకు షుమారు 40 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక సమూహం కొరకు సరికొత్త టౌన్ బ్రమాలియా రూపకల్పన చేయబడింది. అది మునుపు చింగ్యుయా కౌసీ టైన్ షిప్ ఉన్న ప్రదేశంలో నిర్మించాలని నిర్ణయించబడింది. చింగ్యుయా కౌసీ టైన్ షిప్ నిర్మాణాన్ని భవన నిర్మాణ సంస్థ అయిన బ్రమాలియా లిమిటెడ్ (ముందు ఇది బ్రాంప్టన్ లీజింగ్ సంస్థగా ఉండేది) చేపట్టింది. ఫార్మర్ విలియం షియర్డ్ బ్రాంప్టన్ పదం నుండి బ్రం, మాల్టన్ నుండి మాల్ మరియూ లియా (లియా అంటే పాత ఆంగ్లపదం మిడో లేక గ్రాస్ లాండ్) నుండి తీసుకొని బ్రమాలియా అనే పేరు రూపొందించబడింది. ఆయన తన భూమిని బ్రాంప్టన్ లీజింగ్ డెవలపర్ సంస్థకు విక్రయించాడు. బర్మాలియా మొదటి నివాస గృహం మునుపటి నార్టెల్ హెడ్ క్వార్టర్ అయిన డిక్సీ రోడ్డు పక్కన నిర్మించబడింది.

నూతన నగర నిర్మాణంలో ప్రధాన సర్వీసులు, షాపింగ్ మాల్స్ కలిగిన నగరకేంద్రం (డౌన్ టౌన్), ట్రైల్ సిస్టం కలిగిన ఉద్యానవనం కలిగిన ప్రణాళిక రూపొందించబడింది. డౌన్ టౌన్ ప్రాంతంలో కేంద్రస్థానంలో సిటీ హాల్, గ్రంథాలయం కలిగిన సివిక్ సెంటర్ ఉంది. కెనడా డ్రైవ్ టన్నెల్ ప్రస్థుతం భద్రతారీత్యా మూసివేయబడింది. అవి కాక ఇక్కడ పోలీస్ స్టేషను, ఫైర్ హాల్, బస్ టెర్మినల్, ఉద్యోగ విరమణ చేసిన వయోజనుల నివాసగృహాలు ఉన్నాయి. నూతన నగరంలోని విభాగాలకు వరుసగా ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్, ఇ సెక్షన్ వంటి నామకరణాలు చేయబడ్డాయి. అలాగే నూతన నగరంలో నూతనోత్సాహ కేంద్రాలు (రిక్రియేషన్ సెంటర్) టెన్నిస్ మైదానం, క్రీడా మైదానం, హాకీ/లాక్రాస్ మైదానం, ఈత కొలను వంటి సౌకర్యాలు నిర్మించబడ్డాయి. ఒక ప్రత్యేక ఆటవికపయాంతో కూడిన ఉద్యానవనం, సైడ్ వాక్ విధానం నగరమంతటినీ అనుసంధానిస్తూ రూపొందించబడింది.

పీల్ భూభాగం

[మార్చు]

1974లో ఒంటారియో ప్రభుత్వం పీల్ కౌంటీ పునరుద్ధరణకు నిశ్చయించింది. పలు గ్రామాలను మిస్సిస్సగువా నగరంతో విలీనం చేస్తూ ఆ ప్రణాళిక రూపొందించబడింది. టొరంటో గోర్, చింగ్యుయాకౌసీ లోని అధిఅ భాగం కలుపుతూ బ్రాంప్టన్ నగర రూపకల్పన చేయబడింది. ఆ టౌన్ షిప్‌లో బ్రమాలియా, ఇతర గృహసముదాయాలు కలుపబడ్డాయి. ఈ ప్రాంతం కలపడంతో పీల్ కౌంటీ " ది రీజనల్ ముంసిపాలిటీ ఆఫ్ పీల్ " గా మార్చడానికి వీలు కలిగింది. ఇక్కడ పీల్ రీజియన్ పలనా కేంద్రగా బ్రాంప్టన్ నిలిచి పోయింది. అప్పటికి బ్రాంప్టన్ కౌంటీ స్తానంగా ఉంటూ వచ్చింది. ది రీజనల్ కౌంసిల్ చాంబర్, ది పీల్ రీజనల్ పోలీస్ ఫోర్స్, ది పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెట్, ఈ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక ప్రధాన పురాతన వస్తు ప్రదర్శనశాల, పీల్ ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం, ఆర్చివ్స్ ఉన్నాయి.

ఈ ప్రణాళిక పూర్తిగా సర్వజనామోదం పొందలేదు. బ్రాంప్టన్ నివాసులు ఈ విస్తరణ తమ ఊరి వాతావరణాన్ని పాడుచేస్తుందని భయపడ్డారు. బ్రమాలియా నివాసులు తమ ప్రాంతంలో ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు జరగడాన్ని సగర్వంగా అంగీకరించారు. అయినప్పటికీ వారి ప్రత్యేకత కాపాడుకోవడానికి ప్రయత్నించారు. బ్రమాలియాలోని అనేక మంది తాము బ్రాంప్టన్‌లో భాగంగా ఉండడానికి అంగీకరిస్తూ వారు ఆ ప్రాంతాన్ని బ్రమాలియా, హార్ట్ లేక్, బ్రమాలియా అనే మూడు నగర ప్ర్రంతాలుగా ఏర్పడాడానికి తోడ్పడ్డారు. 1972లో బ్రమాలియా సివిక్ సెంటర్ రూపొందించబడింది. బ్రాంప్టన్, బ్రమాలియా విలీనం తరువాత రెండు సంవత్సరాలకు ఈ సివిక్ సెంటర్ నిర్మాణం జరిగింది. ఈ భవనంలో నూతన సిటీ కౌంసిల్ కార్యాలయాలు ఇతర సౌకర్యాలు కల్పించబడ్డాయి. కాత్యలయాలు అధునాతన డౌన్‌టౌన్ ప్రాంతానికి తరలి వెళ్ళాయి. నూతనంగా రూపొందించిన నాలుగు ప్రాంతాలలో " ది లైబ్రరీ సిస్టం ఆఫ్ బ్రాంప్టన్ అండ్ బ్రమాలియా " ఒకటి.

నగరంగా అభివృద్ధి చెందుట

[మార్చు]

12వ శతాబ్ధపు మద్యకాలంలో రెండు ఊర్లుగా ఉండే చింగ్యూకౌసీ, టొరంటో గోర్‌లు బ్రాంప్టన్‌లో విలీనం చెయ్యబడ్డాయి. బ్రమాలియా, హార్ట్ లేక్, ప్రొఫెసర్స్ లేక్, స్నెల్గ్రోవ్, తుల్లామోర్, మేఫీల్ వంటి సమూహాలు రూపుదిద్దుకున్నాయి. 1974 లో బ్రమాలియా, బ్రాంప్టన్ ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. క్లారీవెల్లీ, బెనెజర్, విక్టోరియా, స్ప్రింగ్‌బ్రోక్, చర్చ్వెల్లీ, కొలరనీ, హట్టోన్‌వెల్లీ వంటి గ్రామాలు సహితం ఈ పెద్దనగరంలో విలీనం అయ్యాయి. హట్టాన్‌విల్లీ, చర్చ్ విల్లీ తమప్రత్యేకతను నిలుపుకున్న తరుణంలో క్లైరీవెల్లీ వంటి ఇతర సమూహాలు నూతన అభివృద్ధిలో కలిసిపోయాయి. 1980లో అభివృద్ధిలో భాగంగా గృహనిర్మాణ సంస్థలకు నగరపాలక నిర్వాహం మంజూరు చేసింది. 1995 లో స్ప్రింగ్ డేల్ గృహ సముదాయం నిర్మాణం పూర్తి చేసుకున్న తరువాత ఈ ప్రాంతం నగరంగా మారడం ఆరంభం అయింది. భూభాగం 1999 నాటికి ఉత్తరం సరిహద్దు అయిన కేల్డన్ వరకు బాగా అభివృద్ధి చెందినది. 2021 వరకు నగరానికి ఇది ఉత్తర సరిహద్దుగా ఉండాలని రూపకల్పన చేయబడింది. అయినప్పటికీ పొరుగున ఉన్న సముదాయాలు పీల్ భూభాగంలో భాగం కాకపోయినప్పటికీ పీల్ నగరాభివృద్ధి వారి మీద ప్రభావం చూపింది. బ్రాంప్టన్ సతిహద్దు జార్జ్‌టౌన్ ఆరంభం ప్రస్తుతం గుర్తుపట్టడానికి వీలు కానంతగా మారి పోయింది.

1980లో అప్పటికి ఓడెన్‌కు స్వంతమైన కేపిటల్ ధియేటర్ మూసివేయబడింది. 1981లో మునుపటి మువీ హౌస్, వాడెవెల్లి వెన్యూను మ్యూజికల్, ఆర్ట్ పర్ఫార్మింగ్ ధియేటర్‌గా మార్చబడింది. 2006లో కొత్తగా రోజ్ దియేటర్ పారంభించబడుంది. 1984లో కరబ్రాం స్థాపించబడిన తరువాత స్వయంసేవకులు సంస్కృతుల సరిహద్దులను దాటి స్నేహబంధాన్ని బలపరిచే ఫెస్టివల్ నిర్వహించడానికి ముందుకు వచ్చింది. టొరంటో లైక్ -ఈవెంట్, కారవాన్ ఫెస్టివల్ ఆఫ్ కల్చర్స్ వంటివి ఇందులో భాగమయ్యాయి. కరబ్రాం మొదటి సందర్భంలో ఇటాలియన్, స్కాట్స్, ఉక్రైన్, వెస్ట్ ఇండీస్ ప్రవేశ మార్గాలు చోటుచేసుకున్నాయి. 2003లో జరిగిన ఉత్సవాలలో మొత్తం ఆకర్షణీయమైన18 ప్రవేశమార్గాలు 45,000 పర్యాటకులను అలరించాయి. 1880 చివరిలో, 1990 లలో జాతీయ కెనడా ప్రభుత్వం ప్రకటనలతో ఒక ప్రవేశద్వారం ఏర్పాటు చేయబడింది. కెనడా 25వ స్వాతంత్ర్యోద్యమంలో కెనడాకు కూడా ఒక ప్రవేశమార్గం ఏర్పాటు చేయబడింది.

విభిన్న సంప్రదాయ ప్రజలు అధికంగా స్ర్హిరపడుతున నేపథ్యంలో పీల్ బోర్డాఫ్ ఎజ్యుకేషన్ పాఠశాలలలో ఈవెనింగ్ ఆంగ్లభాషా తరగతులను ప్రవేశ పెట్టిది. ముందు స్వయంసేవకుల చేత జరిగిన ఆంగ్లభాషా తరగతులు క్రమంగా డే టైం తరగతులుగా మార్చి వేతన ఆధారిత ఉపాద్యాయులు నియమినబడ్డారు.1980లో ప్రజలు, కాథలిక్ బోర్డ్ భాగస్వామ్యంతో భాషాబోధనా కార్యక్రమాలు విస్తరించబడ్డాయి. ఈ కాత్యక్రమంలో 23 బాధలు బోధించబడుతున్నాయి. విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలకు తమ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కొరకు పాఠశాల ఆధ్వర్యంతో పోరాడి కార్యక్రమాలను పాఠశాల బోధనా విధానంలో ప్రవేశపెట్టేలా చేసారు.బ్రాంప్టన్లో అధిక సంఖ్యలో దక్షిణాసియన్లు నివసిస్తున్నారు. ఈ సంఖ్య భవిస్యత్తులో ఇంకా అధికం ఔతుందని భావిస్తున్నారు. మేయర్ కెన్‌విలియంస్ 1990 లో బ్రాంప్టన్ డౌన్‌టౌన్‌లో సరికొత్త సిటీహాల్‌ను తీసుకువచ్చాడు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో కెన్‌విలియంస్ మరణించిన కారణంగా సిటీహాల్ ప్రారంభోత్సవంలో పాల్గొనలేక పోయాడు. సిటీహాల్ డౌన్‌టౌన్‌కు మారడం రాజకీయ నాయకులను వ్యాపార సంస్థలను ఉత్సాహపరిచింది. ఇంజోలా కంస్టక్షన్ చేపట్టిన నిర్మాణానికి ప్రాంతీయ ఆర్కిటెక్చర్స్ రూపకల్పన చేసారు.1992లో ది బ్రాంప్టన్ ఫెయిర్ గ్రౌండ్స్ విక్రయించబడింది. 1997లో అగ్రికల్చరల్ సొసైటీ తిరిగి హార్ట్ లేక్ రోడ్డుకు మార్చబడింది. ది హెల్త్ సర్వీసెస్ రీస్ట్రచరింగ్ కమిషన్ (హెచ్.ఆర్.సి) జార్జ్‌టౌన్, డిస్ట్రిక్ మెమోరియల్ హాస్పిటల్, ఎటోబైకోక్ జనరల్ హాస్పిటల్, పీల్ మెమోరియల్ హాస్పిటల్ మొదలైన వైద్యశాలలను విలియం ఓల్సర్ హెల్త్ సెంటర్లో విలీనం చెయ్యాలని నిశ్చయించింది. 2003 బ్రాంప్టన్ ఉత్సవాలు సంస్కృతి సంప్రదాయ స్ఫూర్తిని అనేకరెట్లు పెంచింది. ఈ ఉత్సవాలలో తిరిగి సమ్మర్ పెరేడ్, ఇతర ఉత్సాహభరితమైన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. నగరచరిత్ర గుర్తుచేసేలా చేయడానికి మేయర్ ఫెన్నెల్ తిరిగి పచ్చదనం ప్రణాళికను ప్రవేశపెట్టాడు. 2005 తిరిగి నగరంలో పెరేడ్ నిర్వహించడం, బ్లూం ప్రణాళికలో కెనడా సంప్రదాయక ప్రజలను అందులో భాగస్వాములను చెయ్యడం వంటి కార్యక్రమాలు సంప్రదాయ సంరక్షణలో భాగాలే.

సమకాలీన ఘటనలు

[మార్చు]

2006 లో బ్రాంప్టన్ కాంపస్‌లో ఉన్న విలియం ఓల్సర్ హెల్త్ సెంటర్‌ పేరును పీల్ మెమోరియల్ హాస్పిటల్‌గా మార్చారు. అది అధికకాలం విలియం ఓల్సర్ హాస్పిటల్ భాగంగా ఉండలేదు. 2007 అక్టోబర్ 28 ఒకవైపు పీల్ మెమోరియల్ హాస్పిటల్ పునరుద్ధరణ కొరకు మూసివేయగా, బ్రాంప్టన్ సివిక్ హాస్పిటల్ ప్రారంభించబడింది. అప్పటి నుండి పీల్ మెమోరియల్ హాస్పిటల్ వివాదాలకు కేంద్రంగా మారింది. ప్రాంతీయ వాసులు హాస్పిటలును ఖచ్వితమైన వసతులతో అత్యవసర విభాగం ఏర్పాటుతో పునహ్ప్రారంభించాలని కోరారు. అభివృద్ధిచెందుతున్న నివాసితులను దృష్టిలో పెట్టుకుని కనీసం 429 పడకల ఏర్పాటు చేయాలని తెలియజేసారు. అదే సంవత్సరం సెప్టెంబరు మాసంలో రోజ్‌ధియేటర్ ప్రారంభించబడింది. పునఃప్రరంభం తరువాత డౌన్‌టౌన్ ప్రాంతనంలో అది అతి ఖరీదైనదిగా మారింది. అప్పటి నుండి కొత్త వ్యాపారాలతో షాపులను అభివృద్ధి చేసారు. విదేశీవాణిజ్యం నిర్మాణాత్మకంగానూ ప్రణాఇకాత్మకంగానూ ముందుకు సాగాయి. పత్రికలు బ్రాప్టన్ పునరుద్ధరణతో బ్రాప్టకు కొత్తగాజీవంపోసుకున్నది అని వర్ణించాయి. 2008 ఫిబ్రవరిలో ది సెంట్రల్ వెస్ట్ లోకల్ ఇంటిగ్రేషన్ నెట్వర్క్ పీల్ మెమోరియల్ ఔట్ పేషంట్ సేవలు, మానసిక ఆరోగ్య రక్షణ, కేంసర్ చికిత్స, డే సర్జరీ, సాధారణ చికిత్సలు వైద్య సలహాలు వంటి సేవలను అభివృద్ధి చేసిందని ప్రయిపాదించింది.2012లో బ్రాంప్టన్ సిటీ కౌంసిల్ 2015 పాన్ ఏఎం క్రీడల ఆతిథ్యానికి అంగీకారం తెలుపుతూ ఓటు వేసింది. బ్రాప్టన్ వేసవి క్రీడలలో ఒకదానికి ఆతిథ్యణ్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. అయినా తరువాత క్రీడా ప్రదేశం మార్చబడింది. అందుకు దిఆర్గనైజేషన్ కమిటీ లాన్ ట్రూపు సి.ఇ.ఒ చెప్పిన కారణం " ఆఆర్ధికంగా పలు ప్రయోజనాలను యోచిస్తూ ఈ మార్పు చేయబడింది. ప్రదేశం మార్పు వలన నిర్వహణా వ్యయం, సమస్యలను తగ్గుతుందని, అథిలెట్ల సామర్ధ్యం ప్రదర్శించడానికి అనువైన సౌకర్యాలు కల్పినచవచ్చని ప్రేక్షకులకు మరి కొంత అనుభూతిని పెంచడానికి వీలౌతుంది అని కారణం చెప్పబడింది.

భౌగోళికం

[మార్చు]

బ్రాంప్టన్ మొత్తవైశాల్యం 265 చదరపు కిలోమీటర్లు. తూర్పు సరిహద్దులలో హైవే-50, పడమరన వింస్టన్ చర్చిల్ బహ్లేవార్డ్ (హాల్టన్ హిల్స్), ఉత్తర సరిహద్దులో మేఫీల్డ్ రోడ్ (కేల్డన్) ఉన్నాయి, దక్షిణ సరిహద్దులో ఫించ్ అవెన్యూ ఉన్నాయి.

జంసంఖ్య

[మార్చు]

2006 కెనడా గణాంకాలను అనుసరించి:- మైనారిటీ, ఆదిమవాసుల జనాభా (కెనడా 2006 జనాభా లెక్కలు)

 • శ్వేతజాతీయులు 182,760 ( 42.3%)
 • అల్పసంఖ్యాకులు :-
 • మూలం: దక్షిణ ఆసియా 136,750 (31.7%)
 • చైనీస్ 7,805 (1.8%)
 • బ్లాక్ 53,340 (12.4%)
 • ఫిలిపినో 11,980 (2.8%)
 • లాటిన్ అమెరికన్ 8,545 (2%)
 • అరబ్ 2,600 0.6%
 • ఆగ్నేయ ఆసియా 6,130 (1.4%)
 • వెస్ట్ ఆసియా 2,875 (0.7%)
 • కొరియన్ 580 (0.1%)
 • జపనీస్ 545 (0.1%)

మైనారిటీ, n.i.e. 8,900 (2.1%)

 • బహుళ దృశ్యమాన మైనారిటీ 6,095 (1.4%)
 • మొత్తం అల్పసంఖ్యావర్గాలుగా 246,150 (57%)
 • స్థానిక ఆదిమ సమూహం:-
 • మూలం: ఫస్ట్ నేషన్స్ 1,620 (0.4%)
 • మెటిస్ 785 (0.2%)
 • ఇన్యుట్ 45 (0%)
 • ఆదిమ, n.i.e. 140 (0%)
 • బహుళ ఆదిమ గుర్తింపు 75 (0%)
 • బ్రాప్టన్ వాసులలో వివిధ శాఖలకు చెందిన క్రైస్తవులు 67.78%.
 • క్రైస్తవులలో అధిక సంఖ్యాకుల శాతం 31.11%.
 • ఆంగ్లికన్, యునైటెడ్ చర్చ్, ల్యూథరన్, బాప్తిస్ట్ కలిసి 27.96%.
 • మిగిలిన ఈస్టరన్ ఆర్ధటిక్స్ క్రైస్తవులు 4.70%.
 • సిక్కులు 10.63%.
 • హిందువులు 5.43%.
 • ఇస్లాం మతస్తులు 3.53%.
 • ఏమతానికి చెందని వారు 10%.
 • ది టొరెంటో టెంపుల్స్ ఫర్ ది చర్చ్ ఆఫ్ జీసస్ (తరువాత రోజులలో సెయింట్ మార్మన్) బ్రాంప్టన్‌లో ఉంది.

జనసంఖ్య

[మార్చు]

5,23,911 జనసంఖ్య కలిగిన బ్రాప్టన్ నగరం టొరంటో మహానగరంలో మూడవ స్థానంలో ఉండగా, మొత్తం కెనడా దేశంలో తొమ్మిదవ స్థానంలో ఉంది. అతంర్జాతీయ విమానాశ్రయమైన పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులో ఉండడం, రహదారులు, జనసంఖ్య అభివృద్ధి, భూమి ధర, కార్పొరేషన్ పన్నులు అనుకూలంగా ఉండడం బ్రాప్టన్ నగరాన్ని ప్రధాన ప్రదేశంగా మార్చింది. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాలు, పరిశ్రమలు, భద్రిత వస్తుగృహాలు (గోడౌన్ లేక వేర్ హౌసులు) అలాగే గృహోపయోగ వస్తువులు, సేవలు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధికావలసిన అవసరం ఉంది.

.

భాషలు

[మార్చు]
 • మాతృభాష పరంగా జనాభా శాతం:-
 • ఆంగ్లం మాట్లాడే వారు 269.790 (51,7%)
 • పంజాబీ (పంజాబీ) మాట్లాడే వారు 91,345 (17.5%)
 • ఉర్దూ మాట్లాడే వారు 14,580 ( 2.8%)
 • పోర్చుగీస్ మాట్లాడే వారు 11,095 (2.1%)
 • గుజరాతీ మాట్లాడే వారు 11,040 ( 2.1%)
 • స్పానిష్ మాట్లాడే వారు 10,225 ( 1.9%)
 • హిందీ మాట్లాడే వారు 10,060 ( 1.9%)
 • తమిళ మాట్లాడే వారు 9,530 ( 1.8%)
 • !తగలోగ్ (ఫిలిపినో, పిలిపినో) మాట్లాడే వారు 8,785 (1.7%)
 • ఇటాలియన్ మాట్లాడే వారు 7,990 (1.5%)

ఆర్ధికరంగం

[మార్చు]

బ్రాంప్టన్ లో ప్రధాన కార్యాలయం ఉన్న కంపెనీలు :-

 • లోబ్లా కంపెనీలు లిమిటెడ్
 • లోబ్లా కంపెనీలు లిమిటెడ్‌లో ప్రస్తుతం అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు రోజర్స్ కమ్యూనికేషన్స్ ఇంక్, క్రిస్లర్ కెనడా బ్రాంప్టన్ అసెంబ్లీ ప్లాంట్, లోబ్లా కంపెనీలు లిమిటెడ్, మాపుల్ లాడ్జ్ ఫార్మ్స్, కెనడియన్ టైర్ కార్పొరేషన్, జెల్లర్స్ (కార్యాలయాలు, పంపిణీ), కోకో కోల బాట్లింగ్ కంపెనీ లిమిటెడ్, గామా డైనాకేర్ మెడికల్ లాబొరేటరీస్ మొదలైనవి. * * బ్రాంప్టన్‌లో ప్రధాన కార్యాలయాలు ఉన్న ఇతర కంపెనీలు వరుసగా ఒలిమెల్ లిమిటెడ్ ఎల్.పి లాబ్లాస్, మాపుల్ లాడ్జ్, జెల్లర్స్ కెనడియన్ ప్రధాన కార్యాలయం బ్రాంప్టన్లో ఉంది.
 • బ్రాంప్టన్ నగరంలో బకార్డి, బ్రిటా, పరమైన క్లోరొక్ష్ జాతీయ కార్యాలయాలు ఉన్నాయి.
 • బ్రాంప్టన్ నగరంలో కెనడియన్ ఫోర్సెస్ ఆర్మీ రిజర్వు యూనిట్ మార్కస్ స్కాట్స్ (పీల్, డుఫెరిన్, హాల్టన్ రెజిమెంట్) కు నిలయంగా ఉంది.
 • బ్రాంప్టన్‌లోని ప్రధాన సంస్థలు: - ఐ.కె.ఒ ఇండస్ట్రీస్, బెస్ట్ బై (, ఫ్యూచర్ షాప్), బ్రాఫాస్కో, క్లోరొక్ష్ కంపెనీ, ఫోర్డ్, రోజర్స్ కమ్యూనికేషన్స్, నోర్టెల్, పారా పెయింట్స్, కోకో కోల బాట్లింగ్ కో, నెస్లే, క్రిస్లర్ కెనడా లిమిటెడ్, మాపుల్ లాడ్జ్ ఫార్మ్స్, సోఫినా ఫుడ్స్ ఇంక్, హడ్సన్ బే కంపెనీ (హెచ్.బి.సి ), ఫ్రిటో కెనడా, ఎం.డి.ఎ స్పేస్ మిషన్స్, పార్కిన్సన్ కోచ్ లైన్, కెనడియన్ టైర్ లే మొదలైనవి.
 • 1960లో అమెరికన్ మోటర్స్ స్థాపించిన బ్రాంప్టన్ అసెంబ్లీ ప్లాంట్ స్థాపించబడిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ఆటోమొబైల్స్ తయారు చేస్తున్నది.
 • 1986 లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆపరేషన్ డెవలెప్మెంట్ కొత్తగా దానికి "బ్రమాలలో అసెంబ్లీ" అని పేరుపెట్టారు. దీనిని ఎ.ఎం.సి 1987 లో క్రిస్లర్ హస్తగతం చేసుకున్న తర్వాత, ఎ.ఎం.సి యొక్క కెనడియన్ డివిజన్, దాని మొక్కలతో (బ్రాంప్టన్, బ్రమాలలో) స్థాపించింది. 1992 లో పాత సంస్థ ముగింపుతో సరికొత్త ఫ్యాక్టరీ బ్రాంప్టన్ అసెంబ్లీగా నామకరణం చేయబడింది. 4,200 పైగా కార్మికులు పనిచేస్తున్న ఈ సంస్థ బ్రాంప్టన్ నగరంలో అత్యధికంగా ఉపాధి కలిపిస్తున్న సంస్థలలో ఒకటిగా నిలిచింది.

విద్య

[మార్చు]

బ్రాంప్టన్‌లో ఉన్న ఒకేఒక ఓక్విల్లే ప్రాంగణంలో 1967 లో స్థాపించబడిన షెరిడాన్ కాలేజ్. స్థానిక కంపస్ వ్యాపార శిక్షణ మీద దృష్టిసారిస్తుంది. ఈ విద్యా సంస్థ ఓక్విల్లే శాఖతో పోలిస్తే ఉత్తర అమెరికాలోని ఆర్ట్, డిజైన్ పాఠశాలలో ఇది రెండవ స్థానంలో ఉంది. 24 క్వీన్ స్ట్రీట్ ఈస్ట్ లో ఉన్న మార్కెట్ స్క్వేర్ వద్ద ఆల్గోమా@బ్రాంప్టన్‌ కొన్ని కోర్సులను అందిస్తున్నది.

బ్రాంప్టన్లో రెండు ప్రధాన పాఠశాల బోర్డులు ఉన్నాయి . వాటిలో పీల్ జిల్లా స్కూల్ బోర్డ్ ఒకటి. ఇది తారతమ్యరహిత ఆంగ్ల ప్రజా పాఠశాలలను నిర్వహిస్తున్నది. రెండవది కాథలిక్ ఆంగ్ల ప్రభుత్వ పాఠశాలను నిర్వహించే డుఫెరిన్-పీల్ కాథలిక్ జిల్లా స్కూల్ బోర్డ్. పీల్ జిల్లా స్కూల్ బోర్డ్‌కు చెందిన ఉన్నత పాఠశాలలు బ్రమాలలో, బ్రాంప్టన్ సెంటెనియల్, సెంట్రల్ పీల్, చింగ్యుయాకౌసీ, ఫ్లెచర్స్ మేడో, హెరాల్డ్ ఎం.బ్రాత్‌వైట్, హార్ట్ లేక్, లూయిస్ ఆర్బౌర్, మేఫీల్డ్, నార్త్ పార్క్, జుడిత్ నైమాన్, గంధం హైట్స్, టర్నర్ ఫెంటోన్, డేవిడ్, సుజుకి, సరికొత్తగా స్థాపినచబడిన కేస్టిల్ బ్రూక్ సెకండరీ స్కూల్ ఒకటి. నగరంలో ఈ ఉన్నత పాఠశాలలకు విద్యార్థులను అందిస్తున్న 85 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.

డుఫెరిన్-పీల్ కాథలిక్ జిల్లా స్కూల్ బోర్డ్ కింద ఉన్న ఉన్నత పాఠశాలలు కార్డినల్ లీగర్, మేరీ యొక్క పవిత్ర పేరు, నోట్రే డామే, సెయింట్ అగస్టీన్, సెయింట్ ఎడ్మండ్ ఛాంపియన్, సెయింట్ రోచ్, సెయింట్ మార్గరెట్ 'యువిల్లే, సెయింట్ థామస్ అక్వినాస్ మొదలైన పాఠశాలలు ఉన్నాయి. నగరంలో ఇంకా కార్డినల్ అంబ్రోజిక్ నిర్వహిస్తున్న 44 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఈ ఉన్నత పాఠశాలలకు విద్యార్థులను అందిస్తున్నాయి.

కౌన్సిల్ స్కోలైరే వియామండే కులమతాంతర ఫ్రాంకో పాఠశాలలను నిర్వహిస్తుంది. కౌన్సిల్ స్కోలైరే డే జిల్లా కేథలిక్ సెంటర్ సుడ్ ఈ ప్రాంతంలో కాథలిక్ ఫ్రాంకో పాఠశాలలను నిర్వహిస్తుంది. పీల్ జిల్లా స్కూల్ బోర్డ్ ఉన్నత పాఠశాల స్థాయి మధ్య పాఠశాల నుండి ఇచ్చింది విద్యా కార్యక్రమాలను విస్తృత అందిస్తుంది. ఉదాహరణకు టర్నర్ ఫెంటోన్ సెకండరీ స్కూల్, ఫ్రెంచ్ ఇమ్మర్షన్, అంతర్జాతీయ బాకలారియాట్ ప్రోగ్రామ్ వారి విద్యార్థులు కార్యక్రమాలను అందిస్తుంది. IB కార్యక్రమం కూడా తయారీ అధిక పాఠశాల ప్రోగ్రామ్ ఒక పరిచయ అని పిలువబడే ఒక IB మధ్య సంవత్సరాల కార్యక్రమం (IBMYP) వలె అందించబడుతుంది వీలైనంత మృదువైన ఉండాలి విశ్వవిద్యాలయానికి ఉన్నత పాఠశాల మధ్య పాఠశాల నుండి బదిలీ అనుమతిస్తుంది వారి విద్యార్థులు.

సంస్కృతి

[మార్చు]

బ్రాప్టన్ ఆర్ట్స్ కౌంసిల్‌ చత్రచాయలలో పలు సాంస్కృతిక సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో విషయూయల్ ఆర్ట్స్ బ్రాంప్టన్, ది బ్రాంప్టన్ హిస్టారికల్ సొసైటీ, బ్రాంప్టన్ సింఫోనీ ఆర్కెస్ట్రా మొదలైనవి ఉన్నాయి. ఇవిగాక నగరంలో ది పీల్ ఆర్ట్ గ్యాలరీ, రీజియన్ ఆఫ్ పీల్ చేత నడుపబడుతున్న మ్యూజియం, ఆర్చివ్స్ (పి.ఎ.ఎం.ఎ దీనిని సాధారణంగా పీల్ హెరిటేజ్ కాంప్లెక్స్ అంటార్) కూడా ఉంది.

2006 సెప్టెంబరు మాసంలో ది రోజ్ ధియేటర్ (సాధారణంగా దీనిని ది బ్రాంప్టన్ ఆర్ట్స్ సెంటర్ అంటారు) సాంస్కృతిక, పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉండి పరిసరాలలోని రెస్టారెంట్లు, షాపులు మరుయు సేవాసంస్థల అభివృద్ధికి సహకరిస్తుంది. రోజ్ ధియేటర్ ప్రారంభించిన సంవత్సరం నగరానికి 27 లక్షల అమెరికన్ డాలర్లు ఆదాయం లభించగా ఐదవ సంవత్సరానికి 198 లక్షల అమెరికన్ డాలర్లు లభించింది. రోజ్ ధియేటర్ ప్రారంభసంవత్సరంలో 1,37,000 మందిని ఆకర్షించి ఐదు సవంత్సరాల లక్ష్యాన్ని మొదటి సంవత్సరంలోనే సాధించింది. 2008లో రోజ్ ధియేటర్ ప్రాంగణంలో ఫౌంటెన్ వేదిక ప్రారంభించబడింది. రూజ్ ధియేటర్ పరిసరాలలో పలు వాణిజ్య సంస్థలు తలెత్తాయి. బ్రాప్టన్ నగరంలో ఉన్న 5 లక్షల నివాసితుల అవసరార్ధం 6 గ్రంథాలయాలను నిర్వహిస్తుంది. 80,000 మందికి ఒక గ్రంథాలయం అన్నది కెనడా ప్రధాననగరంలో తక్కువ నిష్పత్తిలో ఉన్నట్లే.

చూడవలసిన ప్రదేశాలు

[మార్చు]
 • గేజ్ పార్క్
 • ఆర్ట్‌వే గ్యాలరీ
 • క్యాంప్ నైవెల్ట్
 • చింగ్యుయాకౌసీ పార్క్-గ్రీన్హౌస్, తోటలు
 • మౌంట్ చింగ్యుయాకౌసీ
 • క్లైరెవిల్లే కన్జర్వేషన్ ఏరియా
 • ఫ్లవర్ సిటీ ధియేటర్ ఫెస్టివల్
 • ఫార్ములా కార్ట్‌వేస్
 • గ్రేట్ వార్ ఫ్లయింగ్ మ్యూజియం
 • హార్ట్ సరస్సు పరిరక్షణ ప్రాంతం
 • బ్రాంప్టన్ హిస్టారికల్ సొసైటీ
 • చారిత్రాత్మక బోవియర్డ్ హౌస్
 • రిమెంబరెన్స్ ఆఫ్ కొరియా వెటరన్స్ నేషనల్ వాల్
 • హానర్ అంటారియో ఫీల్డ్
 • ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం అండ్ ఆర్కైవ్స్ పీల్
 • పవరేడ్ సెంటర్
 • రోజ్ థియేటర్
 • సౌత్ ఫ్లెచ్చర్స్ స్పోర్టెక్స్
 • వైల్డ్ వాటర్ కింగ్డం
 • ఆల్ఫా

ప్రధాన షాపింగ్ బ్రమాలో ఉన్న సిటీ సెంటర్, షాపర్స్ వరల్డ్, "బిగ్ బాక్స్ సెంటర్" ట్రినిటీ కామన్ మాల్ ఉన్నాయి. డౌన్ టౌన్ ప్రాంతంలో రీటైల్, సెంటెనియల్ మాల్, బ్రాంప్టన్ మాల్ ఉన్నాయి.

మాద్యమం

[మార్చు]

రోజరస్ కేబుల్ సేవలను అందిస్తున్న ప్రదేశాలలో బ్రాంప్టన్ ఒకటి. 1970 నుండి కమ్యూనిటీ ఆక్సెస్ ప్రరంభించిన చానల్‌ను ఇప్పటికి చురుకుగా పనిచేస్తున్నది. వారు ప్రసారం చేసే కార్యక్రమాలు కొన్ని వారి బ్రాంప్టన్ నగర స్టూడియోలలో తయారుచెయ్యబడ్డాయి. వారి ప్రధానకాత్యాలయాలలో అనేకం మిసిసిగువా ప్రాంతం వెలుపల ఉన్నాయి. బ్రాంప్టన్ ఒరిజనల్ న్యూస్ పేపర్ తరువాత కమ్యూనిటీకి ఉన్న ఏకైక పత్రిక బ్రాంప్టన్ గార్డియన్ . 1980 నుండి దిడెయిలి టైంస్ ఒక సంవత్సరకాలం మూసివేయబడింది. బ్రాంప్టన్ గార్డియన్ పత్రికను అధిగమించాలని ది బ్రాంప్టన్ బులెటిన్ ప్రయత్నం వరుసగా సంపాదకులు మారిన కారణంగా నిష్ఫలం అయింది.బ్రాంప్టన్ అధికారికంగా సి.ఐ.ఏ.ఒ, సి.ఎఫ్.ఎన్.వై అనే రెండు రేడియో స్టేషన్లకు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఆ రేడియో స్టేషన్లు తమ సేవలను బ్రాంప్టన్ వరకు సరిపెట్టుకోక టొరంటో మహానగరం అంతా తమ ప్రసారసేవలను అందిస్తున్నది.

వెలుపలి లింకులు

[మార్చు]