బ్రిటీషువారి ప్రాంతాలలో విద్యావ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిటిష్ కాలంలో భారతదేశం-విద్య బ్రిటీషు వారి కాలంలో భారతదేశ విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినాయి, ముఖ్యముగా రెండు మార్పులు చెప్పుకోవాలి: ఒకటి అప్పటివరకూ ఎన్ని మార్పులు జరిగినా భారతదేశంలో విద్యావ్యవస్థ మతప్రధానమైనదిగానే ఉండినది, అయితే హిందూ మతము, లేదా బౌద్ధ మతము లేదా ఇస్లాం మతము, కానీ బ్రిటీషు వారు వచ్చిన తరువాత భౌతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినది, వేదాలు చదవడం మానేసి ప్రజలు సైన్సు మొదలగున్నవి చదవడం మొదలుపెట్టినారు. ఇహ రెండవ ముఖ్యమైన మార్పు ఆంగ్ల భాషలో విద్యాబోధన, అప్పటివరకు వివిధ భారతీయ భాషలలో ముఖ్యముగా సంస్కృతములో లేదా అరబిక్ లేదా ఉర్దూ లలో జరిగే విద్యా బోధన ఆంగ్ల భాషలోనికి మార్చబడినది, అంటే మొత్తం మార్చబడినది అని కాదు, కానీ పరిపాలకుల ఆర్థిక సహాయం కేవలం ఆంగ్లము బోధించు పాఠశాలకే ఇవ్వసాగినారు, దానితో ఆంగ్లమునకు ప్రాముఖ్యత పెరిగింది.

బ్రిటీషు వారి విద్యావిధానంలో ఎన్నో కమిటీలు వేసినారు, ఎన్నో సంస్కరణలు ప్రయత్నించారు, కానీ వారు భారత దేశాన్ని వదిలే సమయానికి దేశంలో అక్షరాస్యత పది శాతం కూడాలేదు. దీనికి కారణం వారు పాటించిన జల్లెడ పద్ధతి లేదా ఫిల్టరు పద్ధతి, దీని ద్వారా కేవలం పై తరగతి వారికి చదువు చెప్తితే వారు క్రింది తరగతి వారికి నేర్పుతారు అని భావించడం జరిగినది, కానీ అది ఆచరణలో పెద్ద విఫల ప్రయత్నముగా మిగిలినది.

ఇవీ చూడండి

[మార్చు]