Jump to content

బ్రూనా అబ్దుల్లా

వికీపీడియా నుండి
బ్రూనా అబ్దుల్లా
బ్రూనా అబ్దుల్లా
2018లో బ్రూనా అబ్దుల్లా
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007–2022
జీవిత భాగస్వామి
అలన్ ఫ్రేజ్
(m. 2019)
పిల్లలు1

బ్రూనా అబ్దుల్లా ప్రధానంగా బాలీవుడ్‌లో పనిచేస్తున్న బ్రెజిలియన్ నటి. ఆమె పునీత్ మల్హోత్రా ఐ హేట్ లవ్ స్టోరీస్ (2010),[1] అడల్ట్ కామెడీ చిత్రం గ్రాండ్ మస్తీ (2013) చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధిచెందింది.[2] ఆమె 2012 తమిళ చిత్రం బిల్లా II,[3] 2014 చిత్రం జై హోలో అన్నే పాత్రలో కూడా నటించింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

బ్రూనా అబ్దుల్లా బ్రెజిల్‌లోని గుయాబాలో సిరియన్ సంతతికి చెందిన తల్లి, జర్మన్-ఇటాలియన్ వంశానికి చెందిన తండ్రికి జన్మించింది.[4] ఆమె టూరిస్ట్‌గా భారతదేశానికి వచ్చి బాలీవుడ్‌లో నటిగా పని చేయడం ప్రారంభించింది. ఆ తరువాత, తన కెరీర్‌ని సెట్ చేసుకోవడానికి ముంబైలో స్థిరపడింది.

కెరీర్

[మార్చు]

ఆమె ఇండస్‌ఇండ్ బ్యాంక్, రీబాక్, ఫియామా డి విల్స్.. ఇలా మరెన్నో వాణిజ్య ప్రకటనలలో చేసింది.

ఆమె తన తొలి ఆల్బమ్ మేరే ఘమ్ కే దయారే మేలో శేఖర్ సుమన్‌తో నటించింది. అనుభవ్ సిన్హా క్యాష్ (2007)లో ఆమె "రెహెమ్ కరే" పాట చేసింది. 2011లో విడుదలైన దేశీ బాయ్జ్ చిత్రంలో ఆమె డ్యాన్స్ సీక్వెన్స్‌లో కనిపించింది.

ఆమె రియాలిటీ టీవీ షో డ్యాన్సింగ్ క్వీన్, రియాలిటీ టీవీ షో ఖత్రోన్ కే ఖిలాడీలో కూడా పాల్గొంది. ఆమె 2009 సెప్టెంబరు 9న ఫియర్ ఫ్యాక్టర్ నుండి తొలగించబడి, 2009సెప్టెంబరు 17న వైల్డ్ కార్డ్ రీ-ఎంట్రీ పొందింది. అయితే, 2009 సెప్టెంబరు 24న తిరిగి వైదొలగాల్సి వచ్చింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 2018 జూలై 25న తన స్కాటిష్ ప్రియుడు అలన్ ఫ్రేస్‌తో వివాహ నిశ్చితార్థం చేసుకుంది.[5][6] వారు మే 2019లో వివాహం చేసుకున్నారు.[7] ఈ జంటకు ఒక కుమార్తె ఉంది.[8]

మూలాలు

[మార్చు]
  1. Goel, Pallavi (30 March 2018). "Grand Masti Actress Bruna Abdullah Posted Some Sizzling Hot Pictures On Instagram, But Got Trolled Ruthlessly". Archived from the original on 14 May 2021.
  2. "హిందీ నేర్చుకున్నాకే బాలీవుడ్‌కు : బ్రూనా అబ్దుల్లా | Unfair to do Bollywood film before learning Hindi: Bruna Abdullah - Sakshi". web.archive.org. 2024-04-07. Archived from the original on 2024-04-07. Retrieved 2024-04-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Ajith Kumar's Billa 2 gets a terrific reponse{sic) at the box office". India Today.
  4. "BRUTV ASK ME ANYTHING BRUNA ABDULLAH" (video). youtube.com (in ఇంగ్లీష్). May 28, 2020.
  5. "Watch: Bruna Abdullah gets engaged to her Scottish boyfriend". The Times of India. 25 July 2018. Archived from the original on 7 September 2018. Retrieved 14 August 2018.
  6. "Pregnant Bruna Abdullah wishes to have a water birth! Here is what you need to know about it". The Times of India. 25 June 2019. Archived from the original on 3 July 2019. Retrieved 4 July 2019.
  7. "Bruna Abdullah reveals that she married fiancé Allan Fraser in a low-key ceremony in May | Hindustan Times". 12 July 2019. Archived from the original on 24 September 2019. Retrieved 1 September 2019.
  8. "Bruna Abdullah blessed with a girl, shares the first glimpse of her newborn". The Times of India. 2 September 2019. Archived from the original on 25 September 2019. Retrieved 2 September 2019.