బలమెవ్వడు
Appearance
బలమెవ్వడు | |
---|---|
దర్శకత్వం | సత్య రాచకొండ |
రచన | సత్య రాచకొండ |
నిర్మాత | ఆర్. బి. మార్కండేయులు |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సంతోష్, గిరి |
కూర్పు | జెస్విన్ ప్రభు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | సనాతన దృశ్యాలు |
విడుదల తేదీ | అక్టోబరు 1, 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బలమెవ్వడు 2022లో తెలుగులో విడుదలైన సినిమా. సనాతన దృశ్యాలు బ్యానర్‌పై ఆర్. బి. మార్కండేయులు నిర్మించిన ఈ సినిమాకు సత్య రాచకొండ దర్శకత్వం వహించాడు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, పృథ్వీరాజ్, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలైంది.[1]
కథ
[మార్చు]సత్యనారాయణ (ధృవన్ కటకం) ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్. తన పనిలో భాగంగా పాలసీ కోసం వెళ్లిన అతడికి క్లాసికల్ డ్యాన్సర్ పరిణిక (నియా త్రిపాఠీ)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడి ఇద్దరు పెళ్లిచేసుకుంటారు. ఆ తర్వాత చిన్న సమస్యతో హాస్పిటల్‌కు వెళ్లిన పరిణికకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియడంతో డాక్టర్ ఫణిభూషణ్ (పృథ్విరాజ్) కీమోథెరఫీ చెయ్యాలి అంటారు. ఈ క్రమంలో వారికీ డాక్టర్ యశోద (సుహాసిని మణిరత్నం) ఏవిధంగా సహాయం చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది ? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- ధృవన్ కటకం
- నియా త్రిపాఠీ
- పృథ్వీరాజ్
- సుహాసిని[3]
- నాజర్
- వివేక్ త్రివేది
- అప్పారావు
- ఐ డ్రీమ్ అంజలి
- మణి మహేష్
- శ్రావణ్ భరత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సనాతన దృశ్యాలు
- నిర్మాత: ఆర్. బి. మార్కండేయులు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్య రాచకొండ
- సంగీతం: మణిశర్మ[4]
- సినిమాటోగ్రఫీ: సంతోష్, గిరి
- పాటలు: కళ్యాణ్ చక్రవర్తి
- ఎడిటర్: జెస్విన్ ప్రభు
- ఫైట్స్: శివరాజ్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (25 September 2022). "మెడికల్ మాఫియా కథ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ Sakshi (1 October 2022). "'బలమెవ్వడు' మూవీ రివ్యూ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ Sakshi (19 July 2021). "'బలమెవ్వడు'లో పవర్‌ఫుల్ పాత్రలో సుహాసినీ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ NTV Telugu (31 July 2021). "'బలమెవ్వడు' కోసం మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం!". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.