భక్షక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భక్షక్
దర్శకత్వంపుల్‌కిత్
రచనజ్యోత్సన నాథ్
పుల్‌కిత్
నిర్మాత
 • గౌరీ ఖాన్
 • గౌరవ్ వర్మ
తారాగణంభూమి ఫెడ్నేకర్
సంజయ్ మిశ్రా
ఆదిత్య శ్రీవాస్తవ
సాయి తమంకర్
ఛాయాగ్రహణంకుమార్ సౌరభ్
కూర్పుజుబిన్ షేక్
సంగీతంపాటలు:
అనురాగ్ సైకియా
అనుజ్ గార్గ్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
క్లింటన్ సెరెజో
బియాంకా గోమ్స్
నిర్మాణ
సంస్థ
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
9 ఫిబ్రవరి 2024 (2024-02-09)
సినిమా నిడివి
135 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ

భక్షక్‌ 2024లో హిందీలో విడుదలైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో షెల్టర్ హోమ్ రేప్ కేసు ఆధారంగా[2] రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో గౌరీ ఖాన్, గౌరవ్ నిర్మించిన ఈ సినిమాకు పుల్‌కిత్ దర్శకత్వం వహించాడు. భూమి ఫెడ్నేకర్, సంజయ్ మిశ్రా, సాయి తమంకర్‌, ఆదిత్య శ్రీవాత్సవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 31న విడుదల చేసి[3], సినిమాను ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[4]

పాట్నాలోని మునావర్‌పూర్‌లో వసతి గృహాల్లో ఉండే అనాధ అమ్మాయిలు వరుసగా అత్యాచారానికి గురవుతుంటారు. బన్సీలాల్ (ఆదిత్య శ్రీవాత్సవ) అనాథ బాలికల వసతి గృహాన్ని నిర్వహిస్తూ ఈ మాఫియాను నిర్వహిస్తుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోశిష్ న్యూస్ ఛానెల్‌ను నడుపుతున్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్తు వైశాలి (భూమి పడ్నేకర్‌) వాటిని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది. బన్సీలాల్ కు రాజకీయ నాయకులతో ఉన్న సత్సంబంధాల కారణంగా దానిపై చర్యలు తీసుకోడానికి ఎవరూ సాహసించరు. ఈ నేపథ్యంలో వైశాలి ఎలాంటి సవాళ్లు, ఇబ్బందులు ఎదురుకుంది. ఆధారాలతో సహా వాటిని ఎలా వెలుగులోకి తెచ్చింది? బాలికలను రక్షించి బన్సీలాల్‌ కు శిక్షపడేలా చేసిందా లేదా? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
 • భూమి పెడ్నేకర్ - వైశాలి సింగ్‌[5]
 • సంజయ్ మిశ్రా - బాస్కర్ సిన్హా
 • ఆదిత్య శ్రీవాస్తవ - బన్సీ సాహు
 • సాయి తమంకర్ - ఎస్‌ఎస్‌పి జస్మీత్ కౌర్‌
 • సూర్య శర్మ - అరవింద్ సింగ్‌
 • దుర్గేష్ కుమార్ - గుప్తాజీ
 • చిత్తరంజన్ త్రిపాఠి - మిథిలేష్ సిన్హా
 • తనీషా మెహతా - సుధా కుమారి, వైశాలి స్నేహితురాలు
 • సత్యకం ఆనంద్ - సోను
 • విభా చిబ్బర్ - రజనీ సింగ్‌
 • ప్రవీణ్‌ కుమార్‌ సిసోడియా - బ్రిజ్‌మోహన్‌ సింగ్‌
 • మురారి కుమార్ - బచ్చబాబు
 • సమత సుదీక్ష - గుడియా
 • గులిస్టా అలీజా - బేబీ రాణి
 • శక్తి సిన్హా - పప్పు తేకేదార్‌
 • డానిష్ ఇక్బాల్ - సురేష్ సింగ్‌
 • పుబాలి సన్యాల్ - మమతా సింగ్‌
 • ఫర్హీన్ ఖాన్ - సీమా సింగ్‌
 • ఆదిత్య ఉప్పల్ - ఐజీ సాగర్ ప్రతాప్‌
 • అనురాగ్ - ప్రభాత్ కుమార్
 • బ్రిజ్‌భూషణ్ శుక్లా - పార్టీ కార్యకర్త
 • ప్రభాత్ లెహ్రీ - ఇన్‌స్పెక్టర్ దరో
 • షమ్మీ జాఫరీ - శోభా సాహు
 • ఆనంద్ శర్మ - సీఎం జితేష్ కుమార్
 • అనుజ్ మిశ్రా - ఎస్‌ఎస్‌పి అసిస్టెంట్‌
 • ఎక్రమ్ ఖాన్ - ప్రకాష్ సిన్హా
 • ఉమేష్ కుమార్ శుక్లా - రాధేశ్యామ్‌
 • మహేష్ చంద్ర దేవా - డాక్టర్‌ సేవా గృహ్
 • అమిత్ సిన్హా - ఉమేష్ కుమార్
 • రోనక్ పాండే - భాస్కర్ కొడుకు
 • పునీతా అవస్థి - భాస్కర్ భార్య
 • అంకిత్ సింగ్ - నఫీసా
 • శివ మోహన్ - నావెల్టీ సెక్యూరిటీ గార్డు
 • దినేష్ త్రివేది - పాన్ షాప్ యజమాని
 • సునీల్ కనల్ - దోమ్ మహారాజ్
 • అజయ్ సింగ్ - రజనీ సింగ్ అసిస్టెంట్‌
 • ప్రీతీ శుక్లా - సమాజ్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ

మూలాలు

[మార్చు]
 1. "Bhakshak (15)". British Board of Film Classification. 9 February 2024. Retrieved 9 February 2024.
 2. Eenadu (16 February 2024). "నివేదిత... 'భక్షక్‌' రియల్‌ హీరో". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
 3. Namasthe Telangana (31 January 2024). "ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా భూమి పెడ్నేకర్‌.. ఆస‌క్తికరంగా 'భక్షక్‌' ట్రైల‌ర్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.
 4. V6 Velugu (10 February 2024). "ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ భక్షక్‌..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 5. Chitrajyothy (19 February 2024). "'భక్షక్‌' మరింత ప్రత్యేకం.. అసలు వదులుకోను!". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భక్షక్&oldid=4140563" నుండి వెలికితీశారు