భద్రేశ్ దాస్ స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంస్కృత మహా విద్వాంసుడు, బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ్ సంస్థ (B.A P.S) యోగిపుంగవుడు భద్రేశ్ దాస్ స్వామి .భగవద్గీత బ్ర, హ్మ సూత్రాలు, ఉపనిష త్తులు అనే ప్రస్థాన త్రయం పై 5 భాగాల స్వామి నారాయణ భాష్యాన్ని సంస్కృతంలో రచించిన మహాను భావుడు. అక్షర పురుషోత్తమ వేదాంతాన్ని వ్యాప్తి చేసినవాడు .అక్షర బ్రహ్మ, పరబ్రహ్మ, మోక్ష, భక్తి, ఉపాసనా మార్గాలను విస్తృతంగా ఇందులో చర్చించి మార్గ దర్శనం చేశాడు .శంకర, రామానుజ, మధ్వాచార్య సంప్రదాయాలను అనుసరించి విస్తృతంగా ‘’ప్రస్థాన త్రయం ‘’పై రాసిన మొట్టమొదటి సమగ్ర సంస్కృత వ్యాఖ్యానం ఇది .

విద్యా ఉద్యోగ ప్రస్థానం

[మార్చు]

సంస్కృతం, షట్దర్శనాలలో ఎం.ఎ .డిగ్రీని బెనారస్ సంపూర్ణానంద్ సంస్కృత యూని వర్సిటి భారతీయ విద్యాభవన్ ల నుండి 1996 లోపొందారు. కర్నాటక యూని వర్సిటి నుండి భగవద్గీత పై దిసీస్ రాసి 2005లో పి .హెచ్ .డి.అందుకున్నారు .ఉపనిషత్ ,భగవద్గీత లపై విస్తృత పరిశోధన చేశాడు .మహర్షి సాందీపని వేద విద్యా ప్రతిస్టాన్ లో సభ్యుడయ్యాడు .న్యు ఢిల్లీ లోని స్వామి నారాయణ ఇన్ స్టిట్యూట్ లో, గుజరాత్ లోని వేరావల్ సోమనాధ సంస్కృత విశ్వ విద్యాలయం లోను సంస్కృత , భారతీయ వేదాంతం లపై విద్యార్ధులకు మార్గ దర్శనం చేశాడు .గుజరాత్ లో సారంగపూర్ యజ్న పురుష పాఠశాల లో సంస్కృత శాఖాధ్యక్షుడిగా పని చేసి తత్వ శాస్త్రం ,న్యాయ దర్శనం ,వేదవిజ్ఞానం ,పాణినీయం ,శాస్త్రీయ సంగీత శాస్త్రం లో తబలా ,ఫ్లూట్ వయోలిన్ లపై శిక్షణ నిచ్చాడు .ఢిల్లీ లోని రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ మేనేజర్ గా సమర్దవంతం గా విధి నిర్వహించారు. ప్రస్తుతం వేదాలకు భాష్య రచనలో తలమునకలై పని చేస్తున్నాడు .

సన్మానాలు - సత్కారాలు

[మార్చు]

భద్రేశ్ స్వామి భాష్యానికి గుర్తింపుగా నాగ పూర్ లోని కాళిదాస సంస్కృత యూని వర్సిటి డి.లిట్ ను, మహా మహోపాధ్యాయ బిరుదును ఇచ్చి గౌరవించి సత్కరించింది .మైసూర్ యూని వర్సిటి నుండి జి.ఏం .మెమోరియల్ అవార్డ్ ,’’ దర్శన కేసరి పురస్కారం ‘’, అందుకొన్నాడు .2015 లో బాంకాక్ లో జరిగిన ప్రపంచ సంస్కృత సమ్మేళనం లోధాయ్ లాండ్ లోని సిల్పకారన్ యూనివర్సిటి ‘’వేదాంత మార్తాండ సమ్మాన్ ‘’ప్రదానం చేసి భద్రేశ్ స్వామిని ఘనంగా సత్కరించింది .