భరతేశ్వర్ ఆలయం
భరతేశ్వర్ శివాలయం ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరంలో నెలకొన్న 6వ శతాబ్ది నాటి శివాలయం. ఈ దేవాలయంలో గుండ్రమైన పానవట్టంలో శివలింగం నెలకొనివుంది. శివరాత్రి వంటి పండుగలు ఇక్కడ పాటిస్తారు. కల్పనా చౌక్ నుంచి లింగరాజ ఆలయనికి వెళ్ళే దారిలో ఎడమ చేతి వైపు, రామేశ్వరాలయం ఎదురుగా నెలకొంది.[1] ఈ ఆలయం ప్రాచీన కళింగ పద్ధతికి చెందిన రేఖా విమానం శైలిలో నిర్మితమైంది. ఒడిశాలో ఇప్పటికీ నెలకొనివున్న ఆలయాల్లో అత్యంత ప్రాచీనమైన వాటిలో ఇది ఒకటి.[2][3]
చరిత్ర
[మార్చు]6వ శతాబ్దిలో శైలోద్భవ పరిపాలనా కాలంలో ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ అభివృద్ధి చేస్తోంది.[4]
నిర్మాణ రీతి
[మార్చు]ప్రాచీన కళింగ శైలిలో ఇసుకరాయితో రేఖా విమాన పద్ధతిలో ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణ శైలి, ఆలయం పక్కనే ఉన్న లక్ష్మణేశ్వరాలయంలో అడ్డుదూలంలోని శాసనం ఆధారంగా ఆలయం 6వ శతాబ్ది నాటిదని చెప్పవచ్చు. కింద త్రిరథ, ఎత్తులో త్రియాంగబాద పద్ధతిలో ఉంది.[5]
నోట్స్
[మార్చు]- ↑ "Bharatesvara Siva Temple, Old Town, Bhubaneswar, Dist.-Khurda" (PDF). www.ignca.nic.in. Retrieved 17 October 2017.
- ↑ Odissi dance. Orissa Sangeet Natak Adademi, 1990.
- ↑ "Temples to hog the limelight - Eight important shrines across capital to be lit up with new age energy-efficient floodlights". www.telegraphindia.com. Archived from the original on 18 అక్టోబరు 2017. Retrieved 17 October 2017.
- ↑ "Bharatesvara Siva Temple, Old Town, Bhubaneswar, Dist.-Khurda" (PDF). www.ignca.nic.in. Retrieved 17 October 2017.
- ↑ "ODISHA (ORISSA) TEMPLES". www.heritagetoursorissa.com. Archived from the original on 17 అక్టోబరు 2017. Retrieved 17 October 2017.
మూలాలు
[మార్చు]- Debala Mitra, 1985, Bhubaneswar, New Delhi.
- T. E. Donaldson, 1985, Hindu Temple Art of Orissa, Vol. - I, Leiden.
- R. P. Mohapatra, 1986, Archaeology in Orissa, Vol. - I, New Delhi.