Jump to content

భవాని (సినిమా)

వికీపీడియా నుండి
భవాని
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.సుబ్బారావు
తారాగణం సురేష్,
రమ్యకృష్ణ
నిర్మాణ సంస్థ కృష్ణ ప్రీతమ్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

భవాని 2000 సెప్టెంబరు 1న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణప్రీతం ప్రొడక్షన్స్ పతాకంపై తల్లా 'శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు గోసంగి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సురేష్, రమ్యకృష్ణ లు ప్రధాన తారాగణంగా నటించారు.[1] సంజయ్ దత్ నటించిన హిందీ చిత్రం వాస్తవ్ కు రీమేక్ ఈ చిత్రం.

భవాని ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఏ ఉద్యోగం లేక తల్లిదండ్రులపై ఆధారపడుతూ ఆకతాయిగా తిరుగుతుంటాడు. భవాని అల్లరి ఎక్కువైందని వాళ్ళ నాన్న గట్టిగా మందలించేసరికి తన స్నేహితుడు బ్రహ్మాజీతో కలసి ఒక సెంటరులో ఇడ్లీ బండి పెట్టుకుంటాడు. వ్యాపారం చక్కగా సాగడంతో తన తండ్రి కూడా మెచ్చుకుంటాడు. ఇలా సజావుగా సాగిపోతున్న భవానీ జీవితం ఇడ్లీ బండి వద్ద మలుపు తిరుగుతుంది. నగరంలో పెద్ద దాదా అయిన అన్వర్ మనుషులు ఇడ్లీ తిని డబ్బులు ఇవ్వకుండా బ్రహ్మాజీ తో గొడవ పడతారు. భవానీ తన స్నేహితుడిని విడిచిపెట్టమని ప్రాధేయపడతాడు. ఈ గొడవలో అన్వర్ మనిషి చనిపోతాడు. ఎలాగైనా పోలీసులకు చిక్కకూడదనుకుని జంట నగరాలలో మరో దాదా అయిన రామిరెడ్డిని ఆశ్రయిస్తాడు. రామిరెడ్డి అనుచరుడిగా ఆ గ్యాంగ్ లో చేరి అనేక దందాలు చేసి ఆ సైన్యానికే నాయకుడవుతాడు. అన్వర్ గ్యాంగ్ ను తొలగించి మాఫియా సామ్రాజ్యానికి గాడ్ ఫాదర్ గా స్థిరపడతాడు. చివరికి పోలీసు బలగాలు చుట్టుముట్టడంతో చివరికి తన తల్లి చేతిలో హతమవుతాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: గోసంగి సుబ్బారావు
  • నిర్మాత: తల్లా శ్రీనివాస్
  • నిర్మాణ సంస్థ: కృష్ణ ప్రీతం ప్రొడక్షన్స్
  • విడుదల:01:09:2000.

మూలాలు

[మార్చు]
  1. "Bhavani (2000)". Indiancine.ma. Retrieved 2022-11-28.

బాహ్య లంకెలు

[మార్చు]