భాగవతుల విస్సయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాగవతుల విస్సయ్య (1880-1959) కూచిపూడి నాట్యాచార్యులు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన వృషభనామ సంవత్సర పాల్గుణ మాసంలో కూచిపూడిలో జన్మించారు. వీరి తండ్రి గారు భాగవతుల రామయ్య గారు, విస్సయ్య గారు 7 సంవత్సరాల ప్రాయంలోనే సిద్ధేంద్ర యోగీంద్రుల భామాకలాపాన్ని రాగ, తాళ, హావ, భావాలతో అభ్యసించారు. తండ్రిగారి వద్దా, భాగవతుల యజ్ఞనారాయణ గారి వద్దా భరత శాస్త్రాన్నంతా అభ్యసించారు. 10 సంవత్సరాల ప్రాయంలోనే బాలింత వేషం వేసి ప్రఖ్యాతి వహించారు. బహుమతుల్ని అందుకున్నారు. యుక్తవయస్సు రాగానే బాలింత వేషం, దాదినమ్మ వేషం, ప్రహ్లాదలో లీలావతి, ఉషాపరిణయంలో చిత్రరేఖ, ఉషా కన్యల పాత్రల్ని ధరించి ప్రఖ్యాతి వహించారు. సువర్ణ ఘంటాకంకణాలతో సన్మానాలు పొందారు. తరువాత నాటకాలలో పాత్రలు ధరించటం విరమించి నంగె గడ్డలో కళావంతులకు వారికి నచ్చిన విద్యనంతా నేర్పి, ఆ గ్రామంలో ఏడెనిమిది మేళాల్ని తయారు చేశారు.[3]

16వ శతాబ్దంలో శివరామ కృష్ణనారాయణ తీర్థ శిష్యుడగు సిద్ధేంద్రయోగి కూచిపుడి నాట్యకళను శాస్ర్తియ నృత్యంగా మలిచి, కూచిపూడి కళాకారులకు యక్షగానాలు, భామాకళాపం, తరంగాలు బోధించారని చరిత్రలో మనకు తెలుస్తుందని ఆయన తెలిపారు. తరువాతి కాలంలో భాగవతులు విస్సయ్య, వెంపటి సత్యనారాయణ, వేదాంతం రత్నయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ, చింతా వెంకటరామయ్య, వేదాంతం చిన్నసత్యం ప్రభృతులు ఈ నాట్యకళ కోసం అహర్నిశలు శ్రమించి అభివృద్ధి పరిచారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Kuchipudi,By Sunil Kothari, Avinash Pasricha
  2. తెలుగుజాతి గుండెల్లో నిండిన కూచిపూడి ఉషస్సు
  3. తెలుగువారి జానపద కళారూపాలు రచయిత-డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి, పుట-219
  4. నాట్యకళ సందేశాత్మకంగా ఉండాలి[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]