వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి కూచిపూడి నాట్యాచార్యులు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన 1886 లో సావిత్రమ్మ అంరియు వెంకటేశం దంపతులకు జన్మించారు. ఈయన ప్రముఖ నాట్య గురువైన వెంపటి వెంకటనారాయణ వద్ద నాట్యాన్ని అభ్యసించాడు. ఆయన భామాకలాపం, గొల్లకలాపం వంటి నాట్య రీతులను ప్రదర్శించేవాడు.

ఈయన నాట్యం, సంగీతం, తాళములు వంటి ప్రక్రియలలో కూడా సైద్ధాంతిక, ప్రయోగాత్మక జ్ఞానాన్ని కలిగి యుండేవారు. ఆయన కూచిపూడి నాట్యంలో సోలో వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రఖ్యాతుడైనాడు. ఆయన బాల్యం నుండి నాట్య కళా అభిరుచి ఉండడం మూలంగా కృష్ణామృతం, పుష్పబాణ విలాసం వంటి నుండి అష్టపదులు, పదములు, జావళీలు , పాటలు వంటి వాటిని సాత్వికాభినయం ద్వారా అభినయించేవారు.

ఆయన బోధనలు ఒకేవిధంగా ఉండేవి. ఆయన తన శిష్యులను వ్యక్తిగత శ్రద్ధతో వారిలో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి వారికి శిక్షణనిచ్చేవారు.ఆయన శిష్యులలో ముఖ్యులు వేదాంతం జగన్నాధ శర్మ , వెంపటి చిన్నసత్యం , వెంపటి పెదసత్యం, యామినీ కృష్ణమూర్తి, అయ్యంకి తాండవకృష్ణ.ఆయన దేవాలయ నృత్యకారులకు కూడా శిక్షణనిచ్చేవారు. వారిలో మండపేటకు చెందిన దుగ్గిరాల జగదాంబ, శ్రీరంజితం లు ప్రసిద్ధులు. కూచిపూడి కి చెందని కళాకారులైన టి.బాలసరస్వతి, రామయ్య పిళ్ళై, మైలపూరి గౌరి అమ్మ, తారా చౌదరి వంటి వారు కూడా ఆయన వద్దకు వచ్చి అభినయం లో శిక్షణపొందారు.

1930 లలో కళారంగం సంక్షోభంలో ఉన్నపుడు ఆయన తన కుమారుడైన ప్రముఖ ఆడవేషధారి అయిన వేదాంతం జగన్నాథశర్మతో కలసి భారతదేశ వ్యాప్తంగా పర్యటించి కూచిపూడి ప్రదర్శనలిచ్చారు. లక్ష్మీ నారాయణ శాస్త్రి మహిళలకు నృత్యవిద్యను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. అంతకు పూర్వం పురుషులు మాత్రమే నాట్యరీతిని అభ్యసించేవారు.[1]

ఒక సాటిలేని ప్రదర్శకునిగా, గురువుగా, నృత్యదర్శకునిగా ఆయన విశేష గుర్తింపు పొందారు. ఆయన కృషికి ఫలితంగా ఆంధ్రనాటకకళా పరిషత్,గుడివాడ(1945)వారిచే గౌరవింపబడ్డారు. మద్రాసులో జస్టిస్ పి.వి.రాజమన్నార్ చే సింహతాలాటం బహుకరింపబడ్డారు.[2]

ఆయన 1956 లో మరణించారు.

మూలాలు[మార్చు]

  1. "కూచిపూడి వెబ్‌సైట్". మూలం నుండి 2014-07-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-07-28. Cite web requires |website= (help)
  2. "కూచిపూడి వెబ్‌సైట్". మూలం నుండి 2014-07-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-07-28. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]