జోస్యుల సీతారామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోస్యుల సీతారామయ్య
జననం1923
వృత్తిఅధ్యాపకుడు, ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయవాడ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాట్యాచార్యుడు, నాట్య కళాకారుడు
తల్లిదండ్రులు
  • లక్ష్మయ్య (తండ్రి)
  • గౌరి (తల్లి)

జోస్యుల సీతారామయ్య కూచిపూడి నృత్యకళాకారుడు, గురువు.

విశేషాలు[మార్చు]

ఇతడు ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామంలో 1923లో సంప్రదాయ కూచిపూడి కళాకారుల కుటుంబంలో జన్మించాడు. కూచిపూడి నృత్యంలో ఇతడు ప్రాథమిక శిక్షణను తాడేపల్లి పేరయ్యశాస్త్రి వద్ద తీసుకున్నాడు. తరువాత అభినయాన్ని వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి వద్ద నేర్చుకున్నాడు. ఇంకా సంగీతాన్ని మారుతి సీతారామయ్య వద్ద, భరతనాట్యాన్ని టి. బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై వద్ద అభ్యసించాడు. ఇతడు చిన్ననాటి నుండే కూచిపూడి యక్షగానాలలో నటించడం మొదలు పెట్టి, తరువాతి కాలంలో నృత్యనాటికలలో వివిధ పాత్రలను ధరించసాగాడు. 1959లో ఇతడు విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ నృత్యకళాశాలలో నాట్యాచార్యునిగా చేరి 16 సంవత్సరాలు పనిచేశాడు[1]. తరువాత విజయవాడలోనే స్వంతంగా నృత్యకళానికేతన్, నృత్యకళాంజలి అనే శిక్షణా సంస్థలను నెలకొల్పి ఎందరో కళాకారులను తయారు చేశాడు[2]. 1983లో ఇతడు ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ ఫెలోషిప్‌ను పొందాడు. విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించి గౌరవించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ కూచిపూడి నృత్యానికి ఇతడు చేసిన సేవలను గుర్తించి 1993లో ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించింది[1].

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "సంగీత నాటక అకాడమీ అవార్డు సైటేషన్". Archived from the original on 2020-08-14. Retrieved 2021-02-09.
  2. ఆనంద లాల్ (2004). TheOxford Companion to Indian Theatre (1 ed.). Oxford University Press. ISBN 9780195644463. Retrieved 9 February 2021.