తాడేపల్లి పేరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తాడేపల్లి పేరయ్య (1886 – 1942) కూచిపూడి నాట్యాచార్యుడు. ఆధునిక కాలంలో కూచిపూడి నృత్యాన్ని విస్తృతం చేయడంలో ఆయన కృషి చాలా ఉంది.[1] ఆయన భామాకలాపం మరియు గొల్లకలాపం వంటి ప్రదర్శనలలో నిష్ణాతుడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన గౌరమ్మ మరియు సుబ్బారాయుడు దంపతులకు 1886లో జన్మించాడు. ఆయన భామాకలాపం, గొల్లకలాపాలను ప్రదర్శనలిచ్చేవాడు. ఆయన ప్రదర్శకుని కంటే గురువుగా సుపరిచితుడు. ఆయన స్వతంత్ర్యానికి పూర్వం కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుటకు ఎంతో కృషిచేసిన వ్యక్తులలో మొదటివాడు. ఆయన మేడూరు మరియు నంగిగడ్డలలొ దేవదాసీలకు నాట్యంలో శిక్షణనిచ్చేవాడు. వారితో ప్రదర్శనలను ఏర్పాటుచేసి అందులో సూత్రధారుని పాత్ర పోషించేవాడు. నంగిగడ్డకు చెందిన కృష్ణవేణి మరియు రేపల్లెకు చెందిన బాలాత్రిపురసుందరి అందులో ప్రసిద్ధులు. ఆయన స్వయంగా సూత్రధారునిగా ఏకైక శైలిలో ప్రదర్శనలిచ్చేవాడు. ఇది ప్రేక్షకులతో మంచి సంబంధాలను ఏర్పరిచింది. ఆయన దేవదాసీలకు శిక్షణనిచ్చి మంది ప్రదర్శనకారులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారి జీవితాలను మలచడానికి సంస్కరణల కోసం పాటుపడేవాడు.

ఆయన శిష్యులలో అగ్రగణ్యులు వెంపటి చినసత్యం మరియు జోస్యుల సీతారామయ్యలు. వారి కుటుంబంలో నాట్య సాంప్రదాయ వారితోనే ముగిసింది.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]