భానుమతి (మహాభారతం)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
మహాభారతంలో భానుమతి దుర్యోధనుని భార్య. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు. ఈమె కాశీ రాజు చిత్రాంగదుని కుమార్తె అని కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. ఆమెకు ధనుమతి అనే కవల సోదరి ఉంది. ఆమె భానుమతికి చెల్లెలు.
భానుమతీ స్వయంవరం
[మార్చు]అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని, పాండవులు ఆమెను పెళ్ళిచేసుకొన్ని తర్వతా దుర్యోధనుడు చాలా రోజులు నిద్రలేకుండా అసూయతో రగిలిపోయాడు. అప్పుడు అతని మామ శకుని ద్వారా, కాశీరాజు చిత్రాంగదుడు తన కూతురు భానుమతికి స్వయంవరం ఏర్పాడుచేస్తున్నాడని సమాచారం ఇచ్చి ధుర్యోధనున్ని ప్రోత్సహించాడు. దుర్యోధనుడు తన వెంట, మిత్రులైన కర్ణున్ని, అశ్వద్ధామను కూడబెట్టుకొని స్వయంవరానికి వెళ్ళాడు. బలపరీక్షలేని ఈ స్వయంవరంలో పాల్గొనటానికి అర్హత కేవలం ఒక రాజ్యానికి యువరాజు అయ్యుండటమే. భానుమతి సభలోకి పూలమాలతో అడుగుబెట్టి, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన బలమైన రాజులను తొలగవైచి, ఆమె కళ్ళు కర్ణునిపై పడ్డాయి. అది గమనించిన దుర్యోధనుడు వెంటనే ఆమెను ఎత్తుకొని సభామధ్యంలో బలాత్కారం చేయబోయాడు. కాశీరాజు అడ్డుకొని తన కూతురును అపహరించి తీసుకొని పొమ్మని సెలవిచ్చాడు. దుర్యోధనుడు ఆమెను ఎత్తుకొని హస్తినకు చేరి వివాహం చేసుకొన్నాడు. తన ముత్తాత భీష్ముడు కూడా కాశీరాజు పుత్రికలను తన సవతి తమ్ముళ్ల కోసం ఇలాగే తీసుకొనివచ్చాడని తన చర్యను సమర్ధించుకున్నాడు.
భానుమతి సంతానం
[మార్చు]భానుమతి, ధుర్యోధనులకు ఇరువురు సంతానం. కూతురు లక్ష్మణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. మహాభారత యుద్ధంలో లక్ష్మణ కుమారుడు అభిమన్యుని చేతిలో మరణించాడు. కూతురు లక్ష్మణని, కృష్ణుని కుమారుడు సాంబుడు ఎత్తుకొని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.
మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు](తెలుగునటి భానుమతి గురించిన వ్యాసం "భానుమతీ రామకృష్ణ" చూడండి)