భాయ్ మణి సింగ్
భాయ్ మణి సింగ్ 17వ శతాబ్దానికి చెందిన సిక్కు పండితుడు, అమరవీరుడు, కవి, గురు గోబింద్ సింగ్ చిన్ననాటి స్నేహితుడు. 1699 మార్చిలో గోబింద్ సింగ్ ఖల్సా ప్రారంభించినపుడు సిక్కు మతం ప్రమాణాలు చేశారు మణి సింగ్. 1696లో గురు గోబింద్ మణి సింగ్ ను అమృత్ సర్లో హర్మందిర్ సాహిబ్ ను చూసుకోమని పంపించారు. సిక్కు చరిత్రలో కీలక సమయంలో ఆయన వహించిన పాత్ర మరువలేనిది.
ఇస్లాంలోకి మారనని చెప్పినందుకు ఆయన శరీరంలోని ఒక్కొక్క కీలును విడదీస్తూ చంపేశారు. ఇప్పటికి సిక్కులు ప్రార్థనలో ఈ ఉదంతాన్ని తలుచుకుంటుంటారు.
కుటుంబం
[మార్చు]మణి సింగ్ పూర్వీకులు రాజ్ పుత్ రాజకుటుంబానికి చెందినవారు. ఆయన పూర్వీకుల్లో చాలామంది రాజులుగా రాజరికం చేశారు.[1][2][3][4][5]
మణి సింగ్ 23వ ముత్తాత రాజా విక్రమాదిత్య 911 ADలో రాజ్యం చేశారు.[6][7][8][9]
తండ్రి మాయ్ దాస్ 12 కుమారుల్లో ఒకరు ఆయన. మణి సింగ్ తాత రావ్ బల్లు, గురు హరగోబింద్ సైన్యంలో ప్రముఖ సైనికుడు. ఆయన కుటుంబంలో చాలామంది వీరులున్నారు. ఆయన కజిన్ భగవంత్ సింగ్ బంగేశ్వర్, ఔరంగజేబ్ సమయంలో ఒక రాజ్యానికి రాజుగా చేశారు. ఆయన సోదరుడు దయాలాను ఢిల్లిలో గురు తేగ్ బహద్దుర్ తో పాటు మొఘల్స్ చంపేశారు. ఆయన జీవితంలో చాలా భాగం అమృత్ సర్ లోని హర్మందిర్ సాహిబ్లో సేవ చేస్తూ గడిపారు.
వివాహాలు, పిల్లలు
[మార్చు]ఆయన 15వ ఏట ఖైర్పూర్ రాజు లఖి రాయ్ యదొవంశీ రావ్ కుమార్తె సీతూ బాయ్ ను వివాహం చేసుకున్నారు.
భాయ్ మణి సింగ్ కుమారులు:
- చితర్ సింగ్, 1734లో లాహోర్ లో మణి సింగ్ తో కలిపి ఈయనను కూడా చంపారు.
- బచితర్ సింగ్, 1704లో ఆనంద్ పూర్ సాహిబ్ వద్ద జరిగిన నిహన్ యుద్ధంలో వీరమరణం చెందారు.
- ఉదయ్ సింగ్, 1704లో ఆనంద్ పూర్ సాహిబ్ వద్ద సాహి తిబి దగ్గర చంపబడ్డారు.
- అనైక్ సింగ్, 1704లో చంకూర్ యుద్ధంలో చనిపోయారు.
- అజబ్ సింగ్, 1704లో చంకూర్ యుద్ధంలో చనిపోయారు.
- అజైబ్ సింగ్, 1704లో చంకూర్ యుద్ధంలో చనిపోయారు.
- గుర్బక్ష్ సింగ్, 1734లో లాహోర్ లో మణి సింగ్ తో కలిపి ఈయనను కూడా చంపారు.
- భగవాన్ సింగ్
- బలరాం సింగ్
- దేశాసింగ్- ఖల్సా రహెత్నమా పుస్తక రచయిత.
వీరిలో పై ఏడుగురు ఆయన మొదటి భార్య సీతూ బాయ్ జీకి పుట్టినవారు. మిగిలిన ముగ్గురూ రెండో భార్య ఖెమీ బాయ్ జీకి పుట్టారు.
గురు హర్ రాయ్ కు సేవ
[మార్చు]ఆయన 13వ ఏట తండ్రి రావ్ మాయ్ దాస్ కిరత్పూర్ లో గురు హర్ రాయ్ కు సేవ చేయడానికి తీసుకెళ్ళారు.[10][11] రెండేళ్ళు ఆయన వద్ద సేవ చేశాకా మణి సింగ్ తండ్రితో స్వంత ఊరు వచ్చి బీబీ సీతూ బాయ్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకు భాయ్ జీతా సింగ్, భాయ్ దైల్ దాస్ లతో కలసి తిరిగి కిరత్పూర్ వెళ్ళి గురు హర్ రాయ్ విగ్రహం వద్ద తమను తాము గురు పరంపర సేవకు అర్పించుకున్నారు.
గురు హర్ కిషన్ కు సేవ
[మార్చు]గురు హర్ రాయ్ పరమపదించాకా, గురు హర్ కిషన్ కు సేవ చేయడం మొదలు పెట్టారు మణి సింగ్.[12] గురు హర కిషన్ ఢిల్లీకి వెళ్ళిపోయినప్పుడు ఆయనతో కలసి వెళ్ళిన సిక్కులలో మణి సింగ్ కూడా ఒకరు.
గురు తేగ్ బహద్దూర్ కు సేవ
[మార్చు]30 మార్చి 1664న ఢిల్లీలో గురు హర కిషన్ పరమపదించాకా ఆయన తల్లి మాతా సులఖనికి రక్షణగా ఉండి, ఆమెను బకలా తీసుకువెళ్ళి గురు తేగ్ బహదూర్కు ఆమెను, ఆయన సేవకు తనను సమర్పించారు.[13] ఆయన సోదరులు భాయ్ జీతా సింగ్, భాయ్ దైల్ దాస్ కూడా గురు సేవ చేసుకున్నారు. అప్పటికి మణి సింగ్ వయసు 20 ఏళ్ళు. కొన్నాళ్ళు సేవ చేశాకా తిరిగి వరి ఊరు అలిపూర్ కు వెళ్ళారు.
References
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-04.
- ↑ http://centralsikhmuseum.com/bhai-mani-singh/
- ↑ http://www.thesikhencyclopedia.com/index.php?option=com_search&searchword=alipur&submit=Search&searchphrase=any&ordering=newest&view=search
- ↑ http://books.google.co.in/books?id=vZFBp89UInUC&pg=PA588&lpg=PA588&dq=bhai+mani+singh+alipur&source=bl&ots=BusM1UXi3E&sig=uFpvYRpC_XLgnU5zlbL3zXupLo4&hl=en&sa=X&ei=7Yn9U6PPGcXJuASEkIHABw&ved=0CB4Q6AEwAjgK#v=onepage&q=bhai%20mani%20singh%20alipur&f=false
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2016-08-04.
- ↑ Guru De Sher - Book By Dr. Harjinder Singh Dilgeer
- ↑ Bhai Mani Singh Ate Unha da Parivar - Book By Dr. Harjinder Singh Dilgeer
- ↑ The Growth of the Paramara Power in Malwa Krishna Narain Seth Progress Publishers, 1978 - India - 261 pages
- ↑ Shaheed Bilas Bhai Mani Singh - Giani Garja Singh Page-102
- ↑ Chauhan, Gurmeet (2005). The Gospel of the Sikh Gurus. Hemkunt Press. p. xi. ISBN 9788170103530.
- ↑ Osborne, Eileen (2006). Holy Books B. Folens Limited. p. 32. ISBN 9781843036135.
- ↑ Ralhan, O. P. (1997). The Great Gurus of the Sikhs: Banda Bahadur, Asht Ratnas etc: Volume 5 of The Great Gurus of the Sikhs, The Great Gurus of the Sikhs. Anmol Publications Pvt Ltd. p. 64. ISBN 9788174884794.
- ↑ Gandhi, Surjit (1987). "Bhai Mani Singh". The Sikh Review. 35 (397–408): 12.