భారతదేశంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాచ్య పరిశోధనా సంస్థలు ముఖ్యంగా తూర్పు దేశాల సిద్ధాంతాలను, చరిత్రను, జ్ఞానాన్నీ - మరీ ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినవి - పరిశీలించి, భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు రూపొందినవి. గుళ్ళలో, మఠాలలో, కొన్ని కుటుంబాలలో తాళపత్రాల రూపంలో పరిమితమయిపోయిన కోట్లాది విజ్ఞాన భాండాగారాలను మూలంగా చేసుకుని ఈ సంస్థలు పని చేస్తున్నవి. ఆయా సంస్థల నుండి ఆ తాళపత్రాలను సంగ్రహించి భద్రపరుస్తున్నాయి. కొన్నిటిని పుస్తకాలుగా కూడా ప్రచురించాయి. ఈ పని చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు. ప్రాచ్య పరిశోధనా సంస్థలు పూర్తి స్థాయిలో భారతీయతను అధ్యయనం చేసేందుకు ఉన్నాయి. భారతీయత అనేది భారతదేశ సంస్కృతిని అన్ని కోణాల్లో అధ్యయనం చేసే శాస్త్రం. గురుకులములు, నలందా, తక్షశిల లాంటి సంస్థానాలు కనుమరిగయిపోయాక చాలా వరకూ భారతీయ విజ్ఞానం నష్టపోయింది. అలా నష్టపోయిన జ్ఞానాన్ని తిరిగి తెప్పించి భద్రపరచడం 20వ శతాబ్దం నాటికి చాలా అవసరం అయింది. పాశ్చాత్య పందితులెందరో ఈ విషయమై 19, 20వ శతాబ్దాలలో చాలా కష్టపడి ఎంతో శ్రమకోర్చి పరిశోధనలు చేసారు. భారతీయులు కూడా ఇందులో చాలా వరకూ సహకరించి పాల్గొన్నారు. ఎందరో భారతీయ పండితులు కూడా ఈ శాస్త్రంలో పరిశోధనలు చేసారు. ఈ ప్రాచ్య పరిశోధన సంస్థల ముఖ్యమయిన పని ప్రాచ్య లిపులలో (ప్రాకృతం, నాగర లిపులు) ఉన్న తాళపత్రాలనూ, చేవ్రాతలనూ, తామ్రపత్రాలనూ సేకరించడం. ఈ పత్రాలలో మతం, ధర్మం, సాహిత్యం, వ్యాకరణం, కళలు, శాస్త్రాలు ఉన్నాయి. అలా సేకరించిన పత్రాలను సరిచేసి, వాటిని సవరింపులు చేసి ప్రచురించడం. ఇలా ప్రచురించేప్పుడు టీకా తాత్పర్యాలు కూడా ఇవ్వటం జరిగింది. అలా ప్రచురణ సాధ్యం కాని పత్రాలను చాలా జాగ్రత్తగా భద్రపరచారు.

సంస్థల వివరాలు

[మార్చు]
  • అడయారు గ్రంథాలయము, చెన్నై
  • ఏశియాటిక్ సొసైటీ
  • భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్, పూణే
  • గంగానాథ్ ఝా కేంద్రీయ సంస్కృత విద్యాపీఠ్, అలాహాబాద్
  • కుప్పుస్వామి శాస్త్రి రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్, చెన్నై
  • మద్రాస్ సాంస్క్రిట్ కాలేజ్, చెన్నై
  • మిథిక్ సొసైటీ, బెంగుళూరు
  • ఓరియంటల్ ఇన్‍స్టిట్యూట్, బరోడా
  • ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రెరీ, తిరువనంతపురం
  • ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్, మైసూరు
  • ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్, తిరుపతి
  • సంస్కృత అకాడెమీ, చెన్నై
  • సంస్కృత సాహిత్య పరిషత్, కోల్కతా
  • సాంస్క్రిట్ కాలేజీ, కోల్కతా
  • సరస్వతీ మహల్ లైబ్రెరీ, తంజావూరు
  • విశ్వేశ్వరానంద్ విశ్వబంధు ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ఇండోలోజికల్ స్టడీస్, హోషియార్‍పుర్