అడయారు గ్రంథాలయము
'అడయారు గ్రంథాలయము', పరిశోధనా కేంద్రం 1886లో హెన్రీ స్టీల్ ఆఁల్కాట్ట్ ద్వారా ప్రారంభించబడింది. ఇది చెన్నై లోని అడయారు థియసాఫికల్ సొసైటీలో ఉంది.
చరిత్ర
[మార్చు]డిసెంబరు 1886లో హెన్రీ స్టీల్ ఆఁల్కాట్ట్ లైబ్రెరీ ఆఁల్కాట్ట్ను స్థాపించాడు. ఈ గ్రంథాలయంలో ఆఁల్కాట్ట్ తన జీవితకాలంలో సేకరించిన 24 భాషల్లో ఉన్న 200 పుస్తకాలు ఉండేవి. ఆసియాకు అతను వచ్చిన ప్రతీ సారీ మరిన్ని పుస్తకాలను, కొన్ని అరుదయిన వాటిని సేకరించాడు. 1907లో ఆఁల్కాట్ట్ మరణానంతరం మరికొందరు మతజ్ఞులు ఆ గ్రంథాలయాన్ని నిర్వహించారు. ఈనాడు ఈ గ్రంథాలయంలో దాదాపు రెండున్నర లక్షల (2,50,000) పుస్తకాలు, ఇరవై వేల (20,000) తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. నేడు ఈ గ్రంథాలయం అన్ని ప్రపంచ ప్రాచ్య గ్రంథాలయాల్లోకీ ముఖ్యమయినదిగా ఉంది.
ఈ గ్రంథాలయం మొదట థియసాఫికల్ సొసైటీ లోపల ఉండేది. 1966లో వేరే ప్రత్యేక భవనానికి మార్చబడింది. ఇదే అడయారు గ్రంథాలయ భవనం. ఇక్కడ పబ్లిక్ మ్యూజియం అనే సంగ్రహాలయం కూడా ఉంది. ఈ సంగ్రహాలయంలో పాత పుస్తకాలు, తాళపత్ర, తామ్రపత్ర గ్రంథాలు ప్రదర్శనకు ఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయం స్నాతకోత్తర విద్యార్థులు సంస్కృతం, భారతీయత చదివేవారు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగిస్తారు.
1990 లో ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్టన్ కాయ్ంప్బెల్ (1891-1990) అడయారు గ్రంథాలయానికి మరిన్ని నిధులు సమకూర్చి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్యాంప్బెల్
థియసాఫికల్ రిసెర్చ్ లైబ్రెరీని స్థాపించాడు.[1]
షికాగో విశ్వవిద్యాలయం వారు (యూనివర్సిటీ ఆఫ్ షికాగో) అడయారులోని పురాతన కృతులను భద్రపరిచేందుకు అత్యాధునిక సాంకేతికాలను వాడుతున్నారు.[2]
మూలములు
[మార్చు]- ↑ క్యాంప్బెల్ థియసాఫికల్ రీసెర్చ్ లైబ్రెరీ 25 జూలై 2013 నాటి స్థితి.
- ↑ షికాగో వారి ప్రణాళికలో దక్షిణాసియా ప్రాజెక్టులు