భారతదేశములో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిందీ భాష[మార్చు]

బ్రిటిష్ వారి పరిపాలనలో ఇంగ్లీష్య్ భాష ఉన్నత విద్య, కార్య నిర్వాహకత్వపు భాషగా ఎదిగింది. బ్రిటిషు వారు వెళ్ళిన తరువాత కూడా ఇది ఇలాగే కొనసాగ వలసినదేనా అనే ప్రశ్నకు రెండు సమాధానములు ఉన్నాయి.

  1. ఉత్తర భారతీయుల ప్రకారము హిందీని జాతీయ భాష చెయ్యడము.
  2. (హిందీకి దగ్గరగా లేని మాతృభాష కల) ఇతర భారతీయుల ప్రకారము ఇంగ్లీషును ఆంతరరాష్ట్ర సంబంధములకు వాడుకోవడము.

హిందీని జాతీయ భాషగా చాలా మంది దక్షిణభారతీయులు, హిందీకి దగ్గరగా లేని మాతృభాష కల ఇతర భారతీయులు ఒప్పుకున్నపటికీ వారు సాధారణంగా మూడు భాషలను నేర్ఛుకోవలసి వచ్చును. ఉత్తర భారతీయులకు కూడా ఒక వేరే ప్రాంతీయ నేర్పిస్తే బాగానే ఉంటుంది. ఈ విషయము మీద 1965 ప్రాంతాలలో పార్లమెంటులో నిర్ణయాలు తీసుకోవడాము జరిగింది కాని అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార భాషా సంఘము ప్రయత్నాల వలన ప్రభుత్వ జీ.వోలు కోర్టు కార్యకలాపాలు తెలుగులో పూర్తిగా అనువదించబడ్డాయి.

ఉత్తర భారతదేశములో నివసించే హిందీ రాని భారతీయులు చాలా మంది ద్వితీయ శ్రేణి పౌరులుగా (భారత పౌరుల కంటే తక్కువ వారిగా) భావింపబడడము కద్దు. అలాగే తమిళుల హింది వ్యతిరేక ఉద్యమము జగద్విదితమే (రామస్వామి నాయకర్ నాయకత్వములో) దీనికి హిందీ రాక పోవడము కొంత కారణము.[1] యూరోపియన్ యూనియన్ లో తప్పితే ప్రపంచములో ఇంక ఏ దేశములో ఇటువంటి సమస్య లేనందున [2] ఈ సమస్య పరిష్కారము కనుగొనడానికి కొంత కాలము పడుతుంది.

2007 లో మార్పులు[మార్చు]

  • భారతదేశము లోనే కాక ప్రపంచములో నే అత్యంత ప్రతిష్ఠాకరమైన ఐ.ఐ.టి. ఎంటెన్స్ (IIT-JEE-2007) ను వివిధ భారతీయ భాషలలో 2007 నుండి నిర్వహిస్తున్నారు. ఇందులో తెలుగు కూడా ఉంది. ప్రశ్న పత్రాలు ఇంగ్లీషులో కాని హిందీలో కాని ఉంటాయి. జవాబులు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ లలో వ్రాయవచ్చు.[3]

ఆధారములు[మార్చు]

మూలములు[మార్చు]

బయటి లింకులు[మార్చు]