భారతదేశ నకలు హక్కుల చట్టం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు, సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది.

ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు, ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం, 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ), విపో రికార్డులు, ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.

నకలుహక్కుల కాలపరిమితి[మార్చు]

 • సాహిత్య
 • నాటకీయ,
 • సంగీత,
 • కళాత్మక కృతులు
 • ఛాయాచిత్రాలు
కృతికర్త చనిపోయిన సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి అరవై సంవత్సరాల వరకు
 • అనామక, మారుపేరు కృతులు
 • చనిపోయిన తరువాత తయారైన కృతి
 • సినిమా
 • ధ్వని ముద్రణాలు
 • ప్రభుత్వకృతులు
 • ప్రభుత్వసంస్థల కృతులు
 • అంతర్జాతీయ సంస్థల కృతులు
మొదట ముద్రణ సంవత్సరం తరువాతి సంవత్సరం ప్రారంభంనుండి 60 సంవత్సరాలు.

నకలుహక్కుల ఉల్లంఘన జరిగినట్లుగా పరిగణించబడినవి[మార్చు]

భారత ప్రభుత్వ కృతులు కొన్ని పరిమితులకు లోబడి నకలు హక్కుల ఉల్లంఘన జరిగినట్లుగా పరిగణించబడవు.[1]

 • చట్టసభల చట్టం
 • చట్టసభలలో ప్రవేశపెట్టబడినివేదిక
 • న్యాయస్థానం తీర్పులు

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Indian copyrights act". wikisource. GOI. Retrieved 17 April 2015.