భరత మాత
స్వరూపం
(భారతమాత నుండి దారిమార్పు చెందింది)
భారతమాత అనగా భారతదేశం తల్లి. ఆమె జాతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. ఆమె సాధారణంగా మహిళ వలె కుంకుమ రంగు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకొని ఉంటుంది, కొన్నిసార్లు సింహంతో పాటు ఉంటుంది.[1]
చారిత్రక కోణం
[మార్చు]భారతమాత చిత్రం 19వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. కిరణ్ చంద్ర బెనర్జీచే రూపొందిన ఒక నాటకంలో 1873లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది. బంకిం చంద్ర చటర్జీ 1882 నవల ఆనందమాత్ (Anand Math) పరిచయ భక్తిగీతం "వందేమాతరం", వెంటనే ఈ పాట ఉద్భవిస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ గీతంగా మారింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖదేవాలయం పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానం లోని అమ్మవారి ఆలయంలోని మండప శిల్పాలలో భారత మాత విగ్రహాన్ని దర్శించవచ్చు .అమ్మవారి ఆలయంలోని మండప శిల్ప సంపదలలో భారత మాత విగ్రహం ఉన్నది.[2]
నెల్లూరుజిల్లా పెంచలకోనలోని భరతమాత మందిర చిత్రాలు
[మార్చు]-
పెంచలకోనలోని భారతమాత మందిరం
-
మందిరంలో భారతమాత
-
కన్యాకుమారిలో ఉన్న భారతమాత విగ్రహం
-
యానాంలో సింహంతో సహా ఉన్న భారతమాత విగ్రహం