భారతీయ నాగరికతా విస్తరణం
Appearance
భారతీయ నాగరికతా విస్తరణము | |
కృతికర్త: | మారేమండ రామారావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | భారతీయ సంస్కృతి |
ప్రచురణ: | వేంకట్రామ అండ్ కో |
విడుదల: | 1947 |
ప్రచురణ మాధ్యమం: | ముద్రణ |
పేజీలు: | 89 |
భారతీయ నాగరికతా విస్తరణము మారేమండ రామారావు గారు రచించిన చారిత్రక గ్రంథం. దీనిని 1947 సంవత్సరంలో వేంకట్రామ అండ్ కో వారు ముద్రించారు.
భారతదేశంలోని పూర్వ సంస్కృతీ నాగరికతలు ప్రపంచమంతటా విస్తరించిన అద్భుత క్రమాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది. కాకతీయ సంచిక, శాతవాహన సంచిక వంటి సుప్రసిద్ధ, ప్రామాణిక సంచికలకు సంపాదకత్వం వహించిన చారిత్రిక పరిశోధకుడు, రచయిత మారేమండ రామారావు లభించిన ఆధారాలను అనుసరించి రచించిన గ్రంథమిది. పాశ్చాత్య ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రీ-క్రిస్టియన్ యుగానికి చెందిన మతాలు, నాగరికతలు భారతదేశ నాగరికతతో ముడిపడినవని ప్రస్తుత పరిశోధనలు కనుగోనగా అప్పటికి దొరికిన ఆధారాలను ఉపయోగించి తూర్పుదేశాల్లోని వివిధ నాగరికాంశాలకు నేరుగా భారత మూలాలు ఉన్నాయని రామారావు వివరించారు.
పుస్తకంలోని విషయాలు
[మార్చు]- 1. ఆదర్శములు
- 2. నాగరికతా విస్తృతి
- 3. ఆఫ్‌గనిస్థానము
- 4. మధ్య ఆసియా
- 5. చైనాదేశము
- 6. చంపారాజ్యము
- 7. కాంభోజరాజ్యము
- 8. దక్షిణహిందూదేశము - ప్రాగ్భారతదేశములు
- 9. ఆంధ్రదేశము - ప్రాగ్భారతదేశములు
- 10. సుమత్రాద్వీపము
- 11. యవద్వీపము
- 12. యవద్వీపకళ