భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం
Jump to navigation
Jump to search
భారతీయ మహిళా శాస్త్రవేత్తల అసోసియేషన్ (IWSA) అనునది భారతీయ స్వచ్చంద,ప్రభుత్వేతర సంస్థ. ఇది 1973 నుండి మహిళా శాస్త్రవేత్తలను సేవలందిస్తుంది.ఇది దేశవ్యాప్తంగా పది శాఖలతో విస్తరించి ఉంది. ఈ అసోషియేషన్ ప్రధాన కార్యాలయం వషి వద్ద కలదు. ఈ సంస్థ వసతిగృహం, సంరక్షణ, నర్సరీ సౌకర్యాలను వంటి మౌలిక సదుపాయలను అందిస్తుంది. ఈ సంస్థ అధ్వర్యంలో ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్, ఒక ఆరోగ్య సంరక్షణా కేంద్రం, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం, ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయ శిక్షనా ప్రోగ్రాం లను నిర్వహిస్తుంది. ఈ సంస్థకు మొదటి ప్రెసిడెంట్ ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్త సుమతి భిడే .[1]
లక్ష్యాలు, ఉద్దేశాలు
[మార్చు]- భారతీయ మహిళల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించడానికి.
- సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ రంగాలలో శాస్త్రీయ విజయాలను ప్రోత్సహించడానికి.
- వివిధ శాస్త్రీయ రంగాలలో విద్యతో మహిళల ఆర్థిక, సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడం.
- వివిధ శాస్త్రీయ రంగాలలో పనిచేసే మహిళలకు ప్రతినిధి సంస్థగా ఉండాలి.
మూలాలు
[మార్చు]- ↑ "Cancer specialist passes away". Indian Express. 25 January 1999.