భారతీయ హరితభవన పరిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచంలో అతి పొడవైన, పెద్దదైన హరితభవనం, తైపీ 101

భారతదేశంలో హరితభవన ఉద్యమాన్ని వ్యాపింపజేసే, హరిత భవనాల నిర్మాణం ప్రపంచానికి నాయకత్వం వహించే ఉద్దేశంతో 2001వ సంవత్సరంలో భారతీయ హరితభవన పరిషత్తు (ఇంగ్లీషు - Indian Green Building Council) ని భారతీయ పరిశ్రమల సమాఖ్య స్థాపించింది.[1]

హరితభవన నిర్వచనం

[మార్చు]

ఒక నిర్మాణం, దాని అందుబాటులోని జల, ముడిపదార్థ, శక్తి, ఇతర వనరులను పర్యావరణానికి హానికరం కాని విధానంలో సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, కుళ్లని చెత్తని తక్కువ మోతాదులో మాత్రమే ఉత్పన్నం చేస్తూ ఉంటే ఆ నిర్మాణాన్ని లేదా భవనాన్ని హరిత భవనం అంటారు.

"A green building is one which uses less water, optimises energy efficiency, conserves natural resources, generates less waste and provides healthier spaces for occupants, as compared to a conventional building."

భారతదేశంలో హరితభవన ఉద్యమం

[మార్చు]

భారతదేశంలో హరిత భవన ఉద్యమం, భా.ప.స - సోహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్, హైదరాబాద్ నిర్మాణంతో మొదలైంది. ఇది లీడ్ - ప్లాటినం రేటింగుని పొందిన నిర్మాణము. 20,000 చదరపు అడుగులతో మొదలైన, హరిత భవన నిర్మాణల విస్తృతి, ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏప్రిల్ 2011 నాటికి, సుమారు 1053 హరితభవనాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటి విస్తీర్ణం 648,000,000 చదరపు అడగులు. ఈ 1053లో 147 ఇప్పటికే వాడకంలో ఉన్నాయి.

రేటింగ్ వ్యవస్థలు

[మార్చు]

ఏప్రిల్ 2011 నాటికి, పరిషత్తు ఈ క్రింది రేటింగ్ వ్యవస్థలని రూపొందించింది.

  • LEED India for New Construction
  • LEED India for Core and Shell
  • ఐ.జీ.బీ.సీ హరిత గృహాలు (IGBC Green Homes)
  • ఐ.జీ.బీ.సీ హరిత కర్మాగారాలు (IGBC Green Factory Building)
  • ఐ.జీ.బీ.సీ హరిత ప్రత్యేక ఆర్థిక మండలాలు (IGBC Green SEZ)
  • ఐ.జీ.బీ.సీ హరిత గృహసముదాయాలు (IGBC Green Townships)

స్థానిక కార్యాలయాలు

[మార్చు]

హరిత భవనాల పరిభావనని విస్తృతంగా ప్రచారం చేయడానికి భా.హ.భ.ప కి స్థానిక కార్యాలయాలు ఉన్నాయి. ఇవి అహ్మదాబాద్, బరోడా, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, కొచ్చిన్, కోల్ కత, ముంబయి, పూణె, కోయంబత్తూరు లలో ఉన్నాయి.

హరిత భవన డైరక్టరీ

[మార్చు]

హరితభవన నిర్మాణానికి అవసరమైన పద్ధతులు, వస్తువుల సమాచారాన్ని ఒకేచోటకి చేర్చే ఉద్దేశంతో, భా.హ.భ.ప హరిత భవన డైరక్టరీని రూపొందించింది. హరితభవనాల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న నిర్మాతలు, సలహాదార్లు, వాస్తునిపుణులు, గుత్తేదార్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది.[2]

కార్యక్రమాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

హరిత భవనం

మూలాలు

[మార్చు]
  1. "Say Green, Save Energy". The Hindu. Kerala, India. 17 January 2009. Archived from the original on 22 జనవరి 2009.
  2. "Green Building Directory". IGBC, India. Archived from the original on 30 మార్చి 2012. Retrieved 20 January 2012.

బయటి లంకెలు

[మార్చు]