హరిత భవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రపంచంలో అతి పొడవైన, పెద్దదైన హరితభవనం, తైపీ 101

ఒక నిర్మాణం, దాని అందుబాటులోని జల, ముడిపదార్థ, శక్తి, ఇతర వనరులను పర్యావరణానికి హానికరం కాని విధానంలో సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, కుళ్లని చెత్తని తక్కువ మోతాదులో మాత్రమే ఉత్పన్నం చేస్తూ ఉంటే ఆ నిర్మాణాన్ని లేదా భవనాన్ని హరిత భవనం (Green Building) అంటారు. ఈ హరిత భవనాల భావన, భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఉన్నది. పర్యావరణ కాలుష్యం ఎక్కువగుతున్న ఈ రోజుల్లో హరిత భవనాల ప్రాధాన్యత పెరుగుతోంది. హరిత భవనాల సామర్థ్యాన్ని శక్తి, పర్యావరణ నమూనాల సామర్థ్యత లేదా లీడ్ (ఇంగ్లీషు - Leadership in Energy and Environmental Design - LEED)తో సూచిస్తారు. భారతదేశంలో హరితభవనాలపై అవగాహన కల్పించేందుకు భారతీయ హరితభవన పరిషత్తు (IGBC) కృషి చేస్తోంది.

లాభాలు[మార్చు]

సరైన హరిత భవనం వలన,

  • నీరు 30-50% వరకూ ఆదా అవుతుంది.kaka
  • శక్తి 20-30% వరకూ ఆదా అవుతుంది
  • చక్కటి పగటిపూట వెలుతురు
  • మెరుగైన వాయుప్రసరణ
  • సరైన వ్యర్థపదార్థ నిర్వహణ
  • నివాసితుల ఆరోగ్యం, క్షేమం
  • హరితగృహాల రేటింగ్ పనిముట్లు వలన చేపట్టు (Project) యొక్క అమ్మకపు విలువ పెరుగుతుంది.
  • స్థానిక/ప్రాంతీయ పదార్థాలకి ప్రోత్సాహం, దానివల్ల స్థానిక పరిశ్రమలకి చేయూత
  • రీసైకిల్ చేయబడిన, తిరిగి వాడగల వస్తువులను వాడడం వల్ల కుర్ర పదార్థాల(virgin materials) మీద వత్తిడి తగ్గుతుంది.

అంటే నిర్వహణ ఖర్చుల తగ్గింపు, పర్యావరణంపైన వత్తిడి తగ్గింపు, నివాసితుల యొక్క, ఇరుగు పొరుగు వారి ఆరోగ్యం మెరుగుదల.

లీడ్ గుర్తింపు[మార్చు]

శక్తి, పర్యావరణ నమూనాల సామర్థ్యత అనే రేటింగ్ వ్యవస్థల సమూహంలో హరిత భవనాలు, గృహాలు, గృహసముదాయాల రూపకల్పన, నిర్మాణం, పనితీరుకి సంబంధించిన ప్రమాణాలుంటాయి. దీనిని సంయుక్త రాష్ట్రాల హరితభవన పరిషత్తు (U.S. Green Building Council) రూపొందించింది. భారతదేశంలోని భవనాలకి లీడ్ పరీక్షలు నిర్వహించడానికి భారతీయ హరితభవన పరిషత్తు సంయుక్త రాష్ట్రాల హరితభవన పరిషత్తు(USGBC) నుండి లైసెన్స్ పొంది ఉంది. భారతదేశంలో LEED-New Construction, LEED-Core and Shell గుర్తంపులు ఇవ్వడానికి భారతీయ హరితభవన పరిషత్తు బాధ్యత వహిస్తోంది.

IGBC ఐదు ప్రాకృతిక అంశాలు (పంచభూతాలు - భూమి, నీరు, అగ్ని (శక్తి), గాలి, అకాశం) మీద ఆధారపడిన సంపూర్ణ నిర్మాణ విధానా(whole-building approach)న్ని అవలంభిస్తోంది. ఈ విధానం లో క్రింది రంగాలలో పనితీరుని విశ్లేషిస్తుంది:

  • నిలకడైన స్థల అభివృద్ధి (Sustainable site development)
  • నీటి పొదుపు (Water savings)
  • శక్తి సామర్థ్యం (Energy efficiency)
  • పదార్థాల ఎన్నిక (Materials selection)
  • అంతర్గత పర్యావరణ నాణ్యత (Indoor environmental quality)

బి.ఇ.ఇ గుర్తింపు[మార్చు]

కొన్ని భవనాలు[మార్చు]

భారతదేశము లీడ్' ధ్రువీకరణను అనుసరించి హరిత భవనాలు రూపొందించడంలో 2017 నాటికి అమెరికా కెనడా, ఇంకా చైనా తరువాత భారతదేశము 4వ స్థానంలో ఉంది. భారతదేశములో వ్యాపార సంస్థల, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్యశాలలు, కర్మాగారాలు, భోజన శాలలు, విమానాశ్రయాలు, ఐటి పార్కులు, ఆర్థిక సంస్థలు, ఇన్ఫోసిస్, ఐటీసీ వంటి సంస్థలు హరిత నిర్మాణాలు చేపట్టాయి. భవన నిర్మాణ ప్రరిశ్రమ, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు మొదలగునవి ఈ 'లీడ్' మార్గదర్శకాలను అనుసరించి తమ అన్ని రకాల నిర్మాణాలు, పధకాలు, ప్రాజెక్టులకు అన్వయించుకుంటున్నాయి. [1]

భారతదేశంలో సుమారు 214 IGBC గుర్తింపు పొందిన హరితభవనాలు ఉన్నాయి.

భారతదేశంలోని కొన్ని హరిత భవనాలు

  1. సజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ - పూణె (LEED-ప్లాటినం)
  2. ఒలింపియా టెక్నాలజీ పార్క్ - చెన్నై (LEED-స్వర్ణం)
  3. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - హైదరాబాద్ (LEED-రజతం)
  4. భారతీయ పరిశ్రమల సమాఖ్య - హైదరాబాద్ కేంద్రం (LEED- స్వర్ణం)
  5. గ్రుండ్‌ఫోస్ పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై (LEED-స్వర్ణం)

తమిళనాడు ప్రభుత్వం, గ్రామీణ ప్రాంత పేదలకి సౌరశక్తి ఆధారిత హరిత భవనాలను కట్టించి ఇవ్వాలని నిర్ణయించి, సుమారు 60,000 ఇళ్ళు కట్టడం కోసం 1080కోట్ల రూపాయలు కేటాయించింది. [2]

హరిత గ్రంధాలయాలు తన భవన నిర్మాణాల ప్రతికూల ప్రభావం తగ్గించి, భవన అంతర్భాగ పర్యావరణ నాణ్యతను- స్థలం ఎంపిక, సహజ నిర్మాణ పదార్ధాలు, జీవవ్యర్ధాలను వినియోగం, నీరు, శక్తి, కాగితము వంటి వనరుల పరిరక్షణ, వ్యర్ధ పదార్ధాల తొలగించుట లేదా పునర్వినియోగం ద్వారా పెంచడం చేస్తుంది.

ఇది కూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "LEED IN MOTION: India" (PDF). U.S. Green Building Council: Transforming buildings and communities through LEED. 21 December 2022. Retrieved 21 December 2022.
  2. "Construction of solar-powered green houses for the poor to begin soon". The Hindu. Madurai, India. 14 November 2011.
"https://te.wikipedia.org/w/index.php?title=హరిత_భవనం&oldid=4084583" నుండి వెలికితీశారు