Jump to content

భారత ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం

వికీపీడియా నుండి
సింగపూర్‌లో జరిగిన్న తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ (ఎడమ), భారత ప్రధాని నరేంద్ర మోదీ ల సమావేశం. 2018 నవంబరు.

ఆస్ట్రేలియా భారత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (AI-CECA) అనేది ఆస్ట్రేలియా, భారతదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం. 2011 మేలో రెండు దేశాలు సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాయి. 2022 ఏప్రిల్ 2 న ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి డాన్ టేహన్, భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ పీయూష్ గోయల్ లు మధ్యంతర ఒప్పందంపై సంతకం చేశారు.[1][2]

ఈ ఒప్పందంతో బొగ్గు, కాయధాన్యాలు, గొర్రె మాంసం, ఉన్ని, ఎండ్రకాయలు, అరుదైన మూలకాలతో సహా భారతదేశానికి ఆస్ట్రేలియా చేసే ఎగుమతుల శ్రేణిపై సుంకాలు తగ్గాయి. అవోకాడోలు, చెర్రీలు, ఎండిన ఫలాలు, బ్లూబెర్రీలు, బాదం, నారింజ, మాండరిన్, బేరి, స్ట్రాబెర్రీలతో సహా వైన్, తదితర వ్యవసాయ ఉత్పత్తులపై దశలవారీగా సుంకాలను తగ్గిస్తామని కూడా భారతదేశం హామీ ఇచ్చింది. "ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారతదేశానికి మేము ద్వారాలను తెరుస్తున్నాము" అని సంతకానికి ముందు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ అన్నాడు. ఈ ఒప్పందంతో రాబోయే సంవత్సరాల్లో వాణిజ్యం రెట్టింపు అవుతుందని మంత్రి టెహాన్ అంచనా వేశాడు. "భారత ఆస్ట్రేలియాలు సహజ భాగస్వాములు. ఇద్దరు సోదరుల వలె, రెండు దేశాలు COVID-19 మహమ్మారి సమయంలో ఒకరికొకరు సహాయపడ్డాయి. మా సంబంధం నమ్మకం, విశ్వసనీయతలనే మూలస్తంభాలపై ఆధారపడి ఉంది" అని మంత్రి గోయల్ చెప్పాడు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఆస్ట్రేలియా-భారత సంబంధాలు

మూలాలు

[మార్చు]