Jump to content

భీమావారిపాలెం

వికీపీడియా నుండి

భీమావారిపాలెం బాపట్ల జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఈ గ్రామం అడవులదీవి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

భీమవారిపాలెం అడవులదీకికి అనుబంధగ్రామంగా ఉంది. ఇది 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడి ప్రజలు చాలా శక్తివంతమైనవారు. భీమ అనే ఇంటిపేరు కలిగిన ఈ గ్రామవ్యక్తులు పలనాడు వలసవచ్చారని పూర్వీకుల అభిప్రాయం.బాపట్లలో భీమావారిపాలెం ఉంది.వీళ్ళంతా కాపులు. 12 వ శతాబ్దంలో పల్నాటి యుద్ధంగా పేరుగాంచిన కారంపూడి యుద్ధం జరిగిన తరువాత జీవనం కోసం ఇక్కడికి వచ్చినట్లు కథప్రచారంలో ఉంది. భీమ అనే ఇంటిపేరు కలిగిన వారు బ్రహ్మనాయుడు వారసులని చరిత్రకారులు కూడా నిర్థారించారు. (ఆధారం కావాలి)

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీరామమందిరం:- ఈ ఆలయంలో 2014, నవంబరు-28, శుక్రవారం నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుంకుమపూజలు నిర్వహించారు. జిల్లా ప్రతినిధులు, ధార్మికమండలి సభ్యుల ఆధ్వర్యంలో భజనలు, పూజలు చేసారు. హరికథా కార్యక్రమాలు నిర్వహించారు.

మూలాలు

[మార్చు]