భూస్వామ్య వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భూస్వామ్య వ్యవస్థ (Feudalism) అంటే ఆర్థిక, న్యాయ, సైనిక, సాంస్కృతిక కట్టుబాట్లు కలగలిసిన సామాజిక రాజకీయ వ్యవస్థ. ఇది మధ్యయుగం కాలంలో ఐరోపా ఖండంలో 9 నుంచి 15 వ శతాబ్దాల మధ్యలో విలసిల్లింది.

వ్యవసాయం చేయడంలో ప్రత్యక్ష పాత్ర లేనివారు, దాని ద్వారా వచ్చే లాభాన్ని వారసత్వంగా అనుభవించే ఆర్థిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థలో ప్రధాన భాగం.

చరిత్ర[మార్చు]

సామ్రాజ్యంలో పాలన వికేంద్రీకరణ ఫలితంగా భూస్వామ్య వ్యవస్థ వివిధ రూపాల్లో రూపుదిద్దుకుంది.

భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ[మార్చు]

భారతదేశంలో రాజుల కాలం నుండి భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది. ఇందులో రాజుల కింద భూస్వాములు పనిచేసేవారు. రాజు సొంత సైన్యాలతో పాటు భూస్వాముల సైన్యం కూడా రాజ్య విస్తరణలో సహాయ పడేది. రెవెన్యూ పాలనలో భూస్వాముల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది.[1]

మూలాలు[మార్చు]

  1. "రాజపుత్రులు - సాంస్కృతిక సేవలు". EENADU PRATIBHA. Retrieved 2022-03-09.