భోలూ
భోలూ ది ట్రెయిన్ మేనేజర్ | |
---|---|
సృష్టికర్త | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ |
భోలూ ది ట్రైన్ మేనేజర్ (ట్రైన్ గార్డ్) అనేది భారతీయ రైల్వేల చిహ్నం. ఇందులో, ఒక చేతిలో ఆకుపచ్చ లెన్స్‌తో సిగ్నల్ ల్యాంప్‌ను పట్టుకున్న ఏనుగును కార్టూన్‌గా చూపిస్తుంది. భారతీయ రైల్వేల 150 వ వార్షికోత్సవ సందర్భంగా స్మారక కార్యక్రమాల కోసం దీన్ని రూపొందించి, 2002 ఏప్రిల్ 16 న బెంగుళూరులో ఆవిష్కరించారు. 2003 లో భారతీయ రైల్వేలు తన అధికారిక చిహ్నంగా భోలూను శాశ్వతంగా ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. [1] ఒక భారతీయ నాణేనికి వెనుక వైపున భోలూ బొమ్మను ముద్రించారు.[2]
నేపథ్యం, అభివృద్ధి
[మార్చు]భారతదేశంలో రైల్వేలను 1853 ఏప్రిల్ 16న బాంబే నుండి థానే వరకు ఒక లైన్‌తో ప్రవేశపెట్టారు. ఆ ఘటన 150 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, భారతీయ రైల్వేలు 2002-2003లో మస్కట్‌ను ప్రారంభించడంతో పాటు అనేక కార్యక్రమాలను ప్లాన్ చేసింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ [3] తో సంప్రదించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ద్వారా భోలూ రైలు మేనేజర్ రూపొందించి, 2002 ఏప్రిల్ 16 న బెంగుళూరులో ఆవిష్కరించారు. ఆ రోజు, భోలూ కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌ను సాయంత్రం 6.25 కి బెంగళూరు సిటీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 నుండి ఫ్లాగ్ ఆఫ్ చేశాడు.[1] భారత ప్రభుత్వ ( రైల్వే బోర్డు ) పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ (2007) మాన్యువల్ ప్రకారం భోలూ, 2002 ఏప్రిల్ 15 న అధికారిక ఉపయోగం కోసం అమలులోకి వచ్చింది. తరువాత, 2003 మార్చి 24 న భోలూను భారతీయ రైల్వేల అధికారిక చిహ్నంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.[4]
ప్రజాదరణ
[మార్చు]ఈ మస్కట్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. భోలూ రైలు మేనేజర్ (గతంలో దీన్ని ట్రైన్ గార్డ్ అనేవారు), భోలూ స్నేహపూర్వకంగా, సహాయకారిగా ఉంటాడని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు.[1] 2003 లో భారత ప్రభుత్వ అధికారిక విడుదలలో భోలూని "నైతిక, బాధ్యతాయుతమైన, హృదయపూర్వక, ఉల్లాసవంతమైన చిహ్నం"గా అభివర్ణించింది. అతని చేతిలో ఉన్న ఆకుపచ్చ లైటు కదలికను, భద్రత, సానుకూలతతో ప్రయాణించాలనే ఉద్దేశాన్ని సూచిస్తుంది.[5] 2003 లో భారత ప్రభుత్వం రెండు ( ₹ ) రూపాయల నాణేన్ని, వెనుకవైపున భోలూ ముద్రతో విడుదల చేసింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Bholu the Railways mascot unveiled". The Times of India. 16 April 2002. Archived from the original on 3 April 2012. Retrieved 11 May 2013.
- ↑ 2.0 2.1 "Commemorative currency". Indian Government. 1 September 2003. Retrieved 11 May 2013.
- ↑ "Coins to mark 150 years of Indian Railways". Tribune India. 13 July 2003. Retrieved 11 May 2013.
- ↑ "Manual for Public Relations Department (2007)" (PDF). Government of India, Ministry of Railways (Railway Board). pp. 30–31. Retrieved 11 May 2013.
- ↑ "Bholu to stay with Railways". The Hindu. 24 April 2003. Archived from the original on 29 June 2013. Retrieved 11 May 2013.