భోళానాథ్, దేవేంద్ర పాండే
Hijacking సారాంశం | |
---|---|
తేదీ | 20 డిసెంబరు 1978 |
సారాంశం | Aircraft hijacking |
ప్రదేశం | Varanasi Airport, Uttar Pradesh, India 25°27′08″N 082°51′34″E / 25.45222°N 82.85944°E |
ప్రయాణీకులు | 126 |
సిబ్బంది | 6 |
మరణాలు | 0 |
విమానం రకం | Boeing 737-200 |
ఆపరేటర్ | Indian Airlines |
విమాన మూలం | Calcutta Airport |
గమ్యం | Amausi Airport |
భోళానాథ్ పాండే, దేవేంద్ర పాండే 1978 డిసెంబరు 20 న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 410 ను హైజాక్ చేశారు. కలకత్తా నుండి లక్నో వెళ్ళవలసిన ఆ విమానాన్ని, బలవంతంగా వారణాసి లో ల్యాండ్ చేయించారు. భారతదేశం లో అత్యవసర స్థితి తరువాత అరెస్ట్ చేయబడ్డ ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ లపై నమోదు అయిన కేసులు కొట్టివేయలని డిమాండు చేశారు[1]. వీళ్ళు కేవలం బొమ్మ ఆయుధాలు తీసుకు వెళ్ళారు. కొన్ని గంటలు ప్రయాణికులను, విమాన సిబ్బందిని బందీలుగా ఉంచి తరువాత పత్రికా ముఖంగా లొంగిపోయారు.
వీరికి బహుమానం గా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల తో సత్కరించింది. ఇద్దరూ 1980 ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ నుండి ఎమ్మేల్యేలు గా గెలిచారు. భోళా 1980 నుంచి 1985 వరకు, మళ్ళీ 1989 నుంచీ 1991 బల్లియా నియోజక వర్గానికి ఎమ్మెల్యే గా ఉన్నాడు.
దేవేంద్ర ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లోని ప్రధాన కార్యదర్శి పదవి నుండి రాజీనామా చేసాడు. భోలా పాండే భారత యువజన కాంగ్రెస్ కు జనరల్ సెక్రటరీగా పనిచేసాడు. భోలా పాండే 1991. 1996. 1999, 2004, 2014 లోక్ సభలకు సాలెమ్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు. దేవేంద్ర ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా తరువాత ఎపుడూ కాలేదు. అతను ప్రస్తుతం తర్వాత ఎన్నికలలో సుల్తానాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సీటు కోసం ఆశావహునిగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ Kishin R. Wadhwaney (2005). Indian Airports (Shocking Ground Realities). Diamond Pocket Books. p. 124. ISBN 978-81-288-0872-2. Retrieved 2011-07-28.
ఇతర పఠనాలు
[మార్చు]- Hijacking: A toy-gun affair, India Today, 15 January 1979.
- Tale of two hijackers: One is Congress candidate, other most wanted, The Times of India, 3 April 2014.
బాహ్య లంకెలు
[మార్చు]- Hijacking description at the Aviation Safety Network
- India's tryst with plane hijacks, Business Standard, 18 March 2014.
- IC 410 Plane Hijackers become MLA’s in India, Mythgyaan, 27 March 2019.