Jump to content

మంగేష్ సాంగ్లే

వికీపీడియా నుండి
మంగేష్ సాంగ్లే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
తరువాత సునీల్ రౌత్
నియోజకవర్గం మగథానే

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ[1]
నివాసం ముంబై,మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకుడు

మంగేష్ సాంగ్లే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విక్రోలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

మంగేష్ సాంగ్లే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విక్రోలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎన్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి పల్లవి సంజయ్ పాటిల్‌పై 25,339 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సునీల్ రౌత్ చేతిలో 20,412 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]

మంగేష్ సాంగ్లే 2017 జనవరి 23న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు ముంబైలోని పార్టీ కార్యాలయంలో నగర బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Ex MNS MLA Mangesh Sangle joins BJP | मुंबई: राज ठाकरे को बड़ा झटका, पूर्व विधायक मंगेश सांगले हुए बीजेपी में शामिल - Latest News & Updates in Hindi at India.com Hindi". 24 January 2017. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
  2. "Vikhroli Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 11 December 2024. Retrieved 26 December 2024.
  3. "17 corporators in race to Assembly" (in ఇంగ్లీష్). The Indian Express. 28 September 2009. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.
  4. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  6. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  7. "Former MNS MLA, Sena corporator join BJP" (in ఇంగ్లీష్). India Today. 23 January 2017. Archived from the original on 26 December 2024. Retrieved 26 December 2024.