మంచి వాడు
(మంచివాడు నుండి దారిమార్పు చెందింది)
మంచివాడు1974 లో వీరమాచనేని మధుసూదనరావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు,(ద్విపాత్రాభినయం) వాణిశ్రీ, కాంచన, మొదలగు వారు నటించగా, సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు. కన్నడం లో 1970 లో వచ్చిన. బాలు బెలగితు చిత్రానికి ఈ చిత్రం రీమేక్.
మంచి వాడు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
నిర్మాణం | టి. గోవిందరాజన్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, కాంచన, రమాప్రభ, రాజబాబు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | వీనస్ కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]ఆనంద్/సత్యం గా అక్కినేని నాగేశ్వరరావు
చంద్ర గా వాణిశ్రీ
లత గా కాంచన
రాజు గా కైకాల సత్యనారాయణ
చక్రం గా రాజబాబు
బంగారం సేతు గా పద్మనాభం
హోటల్ మేనేజర్ గా మాడా వేంకటేశ్వరరావు
సక్కుబాయి గా రమాప్రభ
బాలకృష్ణ
హలం
రాణి గా బేబీ సుమతి
పాటలు
[మార్చు]- అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
- అబ్బాయే పుట్టాడు అచ్చం నాన్నలాగే ఉన్నాడు నాన్నలాగే ఉన్నాడు - సుశీల - రచన: ఆత్రేయ
- ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే - ఘంటసాల, సుశీల - రచన: ఆత్రేయ
- ఈ రేయి కవ్వించింది నామేను పులకించింది రా నీలో - సుశీల, ఘంటసాల - రచన: దాశరథి
- చూస్తా బాగా చూస్తా చేయీ చూస్తా చూసి చెబుతా ముందు - ఎం.రంగారావు - రచన: ఆత్రేయ
- చిట్టిపాపలు కథలు వింటూ నిదురపోతారు నిదురపోతూ - ఘంటసాల - రచన: ఆత్రేయ
- పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మ - ఘంటసాల - రచన: ఆత్రేయ
- మాపటికొస్తావా మరి రేపటికొస్తావా మాపటికొస్తే ఇస్తానోయి ఇస్తానోయి - సుశీల - రచన: సి. నారాయణరెడ్డి
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.