మంచివాడు (2011 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచివాడు
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. లక్ష్మీనారాయణ
నిర్మాణం ఎన్.వి.ప్రసాద్,
ప్రసాద్ జైన్‌
తారాగణం తనీష్,
భామ ,
కె.విశ్వనాథ్
చంద్రమోహన్,
సుధ
సంగీతం సిర్పి
నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్
విడుదల తేదీ ఏప్రిల్ 8, 2011
భాష తెలుగు

మంచివాడు 2011, ఏప్రిల్ 8న విడుదలైన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం. పి. లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎన్.వి.ప్రసాద్, ప్రసాద్ జైన్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. తనీష్, భామ జంటగా నటించిన ఈ సినిమాలో కె.విశ్వనాథ్, చంద్రమోహన్, సుధ తదితరులు ఉన్నారు.[1] ఇది 2002లో విడుదలైన వరుషమెల్లమ్‌ వసంతం అనే తమిళ సినిమా రీమేక్. తమిళ సినిమాకు సంగీతం సమకూర్చిన సిర్పినే తెలుగు చిత్రానికి కూడా బాణీలు అందించాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం : పి. లక్ష్మీనారాయణ
  • సంగీతం: సిర్పి
  • నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, ప్రసాద్ జైన్‌

రాజా జయంతి, దశరథరామయ్యల ముద్దుల మనుమడు. తన బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని తాత,నాన్నమ్మల వద్ద పెరుగుతూ ఉంటారు. దశరథరామయ్య దంపతులకు రాజా తండ్రి కాకుండా మరో ఇద్దరు కొడుకులు ఉంటారు. రాజా చదువుపై దృష్టి పెట్టకుండా 5వ తరగతి ఫెయిల్ అవుతాడు. దశరథరామయ్య ఎప్పుడూ రాజాను దండిస్తూ ఉంటాడు. మిగిలిన కుటుంబ సభ్యులు అతడిని వెనకేసుకుని వస్తుంటారు. ఒకసారి అమెరికా నుండి రాజా మేనత్త, మేనమామ వారి కూతురు ఇందుతో సహా వస్తారు. ఇందును చూడగానే రాజా ప్రేమలో పడిపోతాడు. ఇందు ప్రేమను పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఇందు కూడా తనను ప్రేమిస్తున్నదని రాజా భావిస్తాడు. అయితే ఇందు తాను రమేష్‌ను ప్రేమిస్తున్నట్టు రాజాకు చెబుతుంది. దశరథరామయ్య కూడా రాజా ప్రేమకు తన ఆమోదం తెలుపుతాడు. ఇందు రమేష్‌ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిన రాజా నెపాన్ని తనమీద వేసుకుని ఇందును పెళ్ళి చేసుకునేందుకు నిరాకరిస్తాడు. తరువాత ఏమి జరిగింది అనేది మిగిలిన కథ.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Manchivadu". ఫిల్మీ బీట్. Retrieved 17 November 2023.