మంచెం సుబ్రమణ్యేశ్వర రావు
మంచెం సుబ్రమణ్యేశ్వరరావు | |
---|---|
జననం | నేమం, తూర్పు గోదావరి జిల్లా | 1957 మే 26
ప్రసిద్ధి | చిత్రకారుడు |
భార్య / భర్త | సత్యదేవి |
పిల్లలు | రేశ్మీ, తేజ |
తండ్రి | ధర్మా గణపతిరావు |
తల్లి | అమ్మాజీ |
మంచెం సుబ్రమణ్యేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. పౌరాణిక చిత్రాలను, గ్రామీణ జీవన శైలి నేపథ్యంలో చిత్రాలను నీటి రంగుల చిత్రాలను వాష్ టెక్నిక్ లో చిత్రించడం వీరి ప్రత్యేకత.
జననం
[మార్చు]ఇతను 1957, మే 26న తూర్పు గోదావరి నేమం గ్రామంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి ధర్మా గణపతిరావు, తల్లి అమ్మాజీ.[1]
చిత్రకళా ప్రస్థానం
[మార్చు]తన కుటుంబంలో ఎవరికీ చిత్రకళలో అనుభవం లేదు. బాల్యం నుండే చిత్రకళ పై ఆసక్తిగల ఈయన మొదట హై స్కూల్ లో తాడేపల్లి వెంకన్న అనే డ్రాయింగ్ టీచర్ వద్ద చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నాడు. ఆపై దామెర్ల ఆర్ట్ స్కూల్ నందలి రామారావు, అడవిబాపిరాజు, అంట్యాకుల పైడిరాజుల చిత్రాలు ఆయనపై బాగా ప్రభావం చూపాయి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో అక్కడ చిత్రకళాధ్యాపకులుగా పనిచేస్తున్న ఉల్చి గా ప్రాచుర్యం పొందిన రెడ్డిబోయిన కృష్ణమూర్తి తో ఏర్పడిన సాన్నిహిత్యంతో అలవడిన ఈ వాష్ టెక్నిక్ విధానం ఈయనకు బాగా నచ్చడంతో ఆ శైలిలో విరివిగా చిత్రరచన చేయడం ప్రారంభించాడు. నిజానికి చిత్రకళ ఈయనకు వృత్తి కాదు. కేవలం ప్రవృత్తి మాత్రమే. వృత్తిరీత్యా ఆంధ్రాబ్యాంక్ చీఫ్ మేనేజర్ గా చేసి 2016లో పదవీ విరమణ పొందాడు. చిత్రకారుడిగా ఇప్పటికే హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గేలరీ, మరియు ICICR ఆర్ట్ గేలరీ తో పాటు, గుంటూరు విజయవాడ, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి శ్రీకాకుళం జిల్లనందలి రణస్థలం, తదితర ప్రదేశాలలో వ్యక్తిగత ప్రదర్శనలు చేయడం జరిగింది.
బహుమతులు, పురస్కారాలు
[మార్చు]- ‘పైడి రాజుగారి పురస్కారం' రాజమండ్రి చిత్రకళా నికేతన్,
- కాళిదాస్ సాంస్కృతిక అకాడమి, ఉజ్జయిని అవార్డ్,
- గోల్డ్ మెడల్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ
- సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ అకాడమి, నాగపూర్ వారి అవార్డ్
- తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి నగదు బహుమతి
- కోనసీమ చిత్రకళ పరిషత్, అమలాపురం
- అజంతాకళారామం, తెనాలి
- అడపా చిత్రకళా పరిషద్, నర్సిపట్నం
- హరివిల్లు ఆర్ట్ అకాడమి, పాలకొల్లు
- లలితకళా పరిషత్, విశాఖపట్నం,
- లలితకళా కేంద్రం, బాపట్ల
- క్రియేటివ్ హార్ట్స్, అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
మూలాలు
[మార్చు]https://64kalalu.com/artist-manchem-one-man-show/ https://www.youtube.com/watch?v=5HVx_X7xtSs
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;జింకా జీవకళ
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు