మంజీర గాథ
మంజీర గాథ | |
కృతికర్త: | మరుపూరు కోదండరామిరెడ్డి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | |
విడుదల: |
మంజీర గాథ గ్రంథము తమిళ ప్రాచీన గ్రంథమైన శిలప్పదికారానికి తెలుగు అనువాదం. ఈ గ్రంథాన్ని కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామిరెడ్డి అనువదించారు.
అనువాదకుని గురించి
[మార్చు]మరుపూరు కోదండరామిరెడ్డి బహుగ్రంథకర్త. ఆయన 1920ల్లో గాంధీజీ ప్రభావంతో ఆంగ్లేయవిద్యను త్యజించి ఆప్తమిత్రుడు బెజవాడ గోపాలరెడ్డితో పాటుగా బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో చేరారు. ఆ సమయంలో వారికి పలువురు రాజకీయవేత్తలు, స్వాతంత్రసమరయోధులు, సాహిత్యవేత్తలు పరిచయమయ్యారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో విశిష్ట సభ్యునిగా, కేంద్రసాహిత్య అకాడెమీ, రాష్ట్రీయ సంఘానికి సభ్యునిగా పలుమార్లు పనిచేశారు. అనువాదకునిగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను కర్ణకుంతి, విసర్జన గ్రంథాలుగా అనువదించారు.
ఆయన ఆకాశవాణి ఆంధ్రశాఖలో గ్రామీణ సభ్యునిగా నియమితులైనారు. మద్రాసు, హైదరాబాద్, విజయవాడ, కడప ఆకాశవాణి కేంద్రాలు వివిధ విషయాలపై ఆయన చేసిన ప్రసంగాలను, వ్యాసాలను ప్రసారం చేశాయి. రేడియో కేంద్రాలలో వినిపించిన ప్రభాత సూక్తులు కార్యక్రమానికి సూక్తులను అందజేసి ప్రాచుర్యం పొందారు.