మండలేముల సీతారామశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మండలేముల సీతారామశాస్త్రి బొబ్బిలి సంస్థానానికి చెందిన సుప్రసిద్ధ కవి పండితులు.

వీరు బొబ్బిలి రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు గారి కోరిక మేరకు "బొబ్బిలివారి వంశావళి" ని రచించారు. ఇది బొబ్బిలి మహారాజు గారు రచించిన "హిస్టరీ ఆఫ్ బొబ్బిలి జమిందారీ " అనే ఆంగ్ల గ్రంథానికి పద్య రూపాంధ్రీకరణ. ఇది ఏకాశ్వాస గ్రంథముగా 616 పద్యాలను కలిగియున్నది. ఇందులో మొదటి 104 పద్యాలు బొబ్బిలి పూర్వ చరిత్రను, తర్వాత 512 పద్యాలు రాజావారి పరిపాలనను తెలియజేస్తున్నాయి.

ఇందులో కవి తనను తాను గురించి ఇలా చెప్పుకున్నాడు:

మండలేములపద మండిత కౌండిన్య
గోత్రజు వేంకట కోవిద సుతు
సూర్యనారాయణ సుర్యపదిష్ట స
త్కావ్య నాటక బొధ ఘనుసుసర్ల
వంశ్య సీతారామ పర గురుకరుణా స
మాగత న్యాయ వేదాంత బోధ
కలితు వేంకట రామకవి...54

మూలాలు[మార్చు]

  • బొబ్బిలి సంస్థాన చరిత్ర - సాహిత్య పోషన, రచయిత : బోనాల సరళ, 2002.