మందడి కృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మందడి కృష్ణారెడ్డి తెలుగు రచయిత. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

మందడి కృష్ణారెడ్డి తెలంగాణ లోని నల్లగొండ జిల్లా తిమ్మాజిగూడెంలో 1956 డిసెంబర్ 12న జన్మించాడు. అతను ఎం.ఏ. ఎమ్.ఒ.ఎల్., డిప్లమో ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేసాడు. ఆ తర్వాత ఓ దశాబ్దం పాటు కె.జి. నుండి ఏ.జి. దాకా అధ్యాపకునిగా పనిచేసాడు. తరువాత వ్యాపారవేత్తగా మారిపోయాడు.

కన్స్యూమర్ అవేర్నెస్ అండ్ రీసెర్చ్ సొసైటీ (Cars Trust) నిర్వాహకునిగా, దక్షిణ భారతదేశంలో కెల్లా అతి పెద్ద కన్స్యూమర్ అసోసియేషన్ సంస్థ అభివృద్ధికి అవిరళ కృషి చేసాడు.

అతను నవంబరు 2000 లో సౌత్ ఆఫ్రికా డర్బన్ ఐసిసిలో జరిగిన అంతర్జాతీయ వినియోగదారుల 16వ ప్రపంచ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున ఆహ్వానం అందుకున్న ఏకైక వ్యక్తి. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, మారిషన్, మడగాస్కర్. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్, బాంకాక్, వియత్నాం, కంబోడియా, లావోస్, బ్రూనే, ఇండోనేషియా, బర్మా తదితర దేశాలను సందర్శించి వినియోగదారుల ఉద్యమం, కార్యక్రమాలపై పలు ఉపన్యాసాలను చేసాడు[2].

పుస్తకాలు

[మార్చు]
  • మందడి కథలు - 1991

కథలు

[మార్చు]
కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది సంపుటి
అదృష్టం మళ్లీమళ్లీ రాదు మయూరి వారం 1987-01-23
ఆయిదేళ్ల తర్వాత ప్రగతి వారం 1991-01-01 మందడి కథలు
ఊహించని ఉత్తరం మయూరి వారం 1986-12-08 మందడి కథలు
గుప్పిట తెరిస్తే ఆంధ్రభూమి వారం 1991-01-01 మందడి కథలు
ప్రిస్క్రిప్షన్ ఆంధ్రప్రభ వారం 1991-01-01 మందడి కథలు
మారని సంఘం జ్యోతి మాసం 1991-01-01 మందడి కథలు
రాజకీయ నీతి యువ మాసం 1991-01-01 మందడి కథలు
రెంటికి చెడిన రమణి ఆంధ్రజ్యోతి వారం 1991-01-01 మందడి కథలు
సైకాలజి మయూరి వారం 1986-10-30 మందడి కథలు
సైకియాట్రిస్ట్ విజయ మాసం 1991-01-01 మందడి కథలు
స్వార్ధపు సంకెళ్లు ప్రజాతంత్ర వారం 1991-01-01 మందడి కథలు

మూలాలు

[మార్చు]
  1. "మందడి కృష్ణారెడ్డి - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-31.
  2. "మందడి కథలు | Sundarayya Vignana Kendram". sundarayya.org. Retrieved 2024-10-31.