Jump to content

మందుల (కులం)

వికీపీడియా నుండి

మందుల బి.సి.ఏ.గ్రూపు కులం. మందులవాళ్ళు. వీరు తెలంగాణ అన్ని జిల్లాలలో విస్తరించినప్పటికీ, రాయలసీమ, కోస్తా అంధ్రలో తక్కువగా కనిపిస్తారు. మందులోడా ఓరిమాయలోడా అనే జానపద గీతం ఈ కులస్తులపై పాడిందే.

వృత్తి, సామాజిక జీవనం

[మార్చు]
వీధిలో వనమూలికలను అమ్ము తున్న వాడు

మందులు వృత్తిపై ఆధారపడే జీవనం సాగిచేవారు, కనుక మందుల వాళ్లని పేరు వచ్చింది. మహిళలు కూడా పురుషులతోపాటు వనమూలికల సేవరణ నుంచి మందులు తయారీలో తమ వంతు సహాయం అందిం చేవారు. జలుబు, దగ్గు, తల నొప్పి వంటి వాటికి శొంఠి, మిరియాల కషాయం ఏ విధంగా ఉపయోగించుకునేవారో అదే విధంగా రుతువులు మారుతున్న సమయంలో సంక్రమించే జబ్బుల నివారణకు వీరిని ఆశ్రయించేవారు. వనమూలికలు అవసరమైన నాటువైద్యులే కాదు, ఆయుర్వేద వైద్యులు సైతం వీరిని ఆశ్రయించేవారు. వీరి పూర్వీకులును అప్పటి ప్రభుత్వం సంచార జాతిగా గుర్తించింది. అప్పట్లో వీరు ఎక్కువగా ఊరి చివర్న ఉన్న చెరువులు, కాల్వగట్లపైన, తాటితోపుల్లో జీవించేవారు. గ్రామాలలో తిరిగి మందులు అమ్మేవారు. పది పన్నెండు కుటుంబాలు కలిసి సమూహంగా జీవించేవారు. తాటి, ఈత ఆకులతో వేసుకున్న గుడిసెల్లో కాపురముండేవారు. మందుల కులం వారినీ దేవతల వైద్యులు అయినా అశ్వనీ దేవతల వారసులుగా చెబుతారు. పాండవ మధ్యముడాయిన అర్జునిని మనవడు జనమేజయనీ చరిత్ర లో మందుల కులం వారినీ జనమేజయుడు శపించినట్లు ఆయన శాపం వల్ల రాజ్య వైద్యులు అయినా మందుల కులం వారు పేద బ్రతుకులు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో కొందరు తమ కులవృత్తి అయిన ఆయుర్వేదం వైద్యం చేసుకొని జీవిస్తున్నారు. మరికొందరు బ్రతకు దెరువు కోసం ఇతర పనులు చేసుకొని జీవిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడి కులాల జాబతాలో బి.సి ఎ గ్రూపులో మందుల కులం ఉంది.

సమస్యలు

[మార్చు]

పజావుగా సాగుతున్న వీరి వనమూలికా వైద్యంపై ఇంగ్లీషు మందుల ప్రభావం పడింది. వీరి వృత్తి దెబ్బతింది, ఆదాయం తగ్గింది, బతుకు భారమైంది. మూలికా వైద్యంలో పోల్చు కుంటే అప్పట్లో ఇంగ్లీషు వైద్యం ఖర్చు తక్కువ కావటం, మందు వాడకునే విధానం కూడా సులువు కావటంతో ప్రజలు అటువైపు మెగ్గు చూపారు. వనమూలికల విలువలు తెలిసిన గత తరంవారు క్రమంగా మృతి చెందటం, నేటి తరానికి చెంది నవారికి వీటి గురించి స్పస్టమైన అవగాహన లేకపోవటంతో కూడా వనమూలికా వైద్యం ఆదరణ కోల్పోయింది. ఈ నేప థ్యంలో క్రమంగా మందుల వారు కూడా వృత్తికి దూరయ్యా రు. ఇప్పటికీ వృత్తిని నమ్ముకున్నవారు వైద్యం చేస్తూనే కాలం గడుపుతున్నారు. కొన్ని చోట్ల పందులను పెంచి వచ్చిన డబ్బుతో కు టుంబాన్ని పోషించుకుంటున్నారు. కొందరు ఇతర పనులు చేసుకొని జీవిస్తున్నారు. మందుల కులం నుంచి ఒక్క ఐఏఎస్‌, ఐపిఎస్‌ కాదుకదా... కనీసం గ్రూప్‌ వన్‌ అధికారి కూడా లేడని అన్ని జిల్లాలలోనూ మందుల వారికి కాలనీలను కమ్యూనిటీ హాలు ప్రభుత్వం నిర్మించాలని వీరు కోరుతున్నారు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

పాండవ మద్యముడు అయిన అర్జునిని మనవడు ఆయన జనమేజయుని చరిత్ర లో జనమేజయుడు పాము కాటుకి గురివ్వడంతో దేవతల వైద్యులు అయినా అశ్వనీ దేవతలకు కబురు పంపగా అశ్వనీ దేవతలు జనమేజయుడు కి చికిత్స కోసం వస్తున్న క్రమంలో తమకు అడ్డంకులు ఏ్పడడంతో అశ్వనీ దేవతలు విష్ణుమూర్తిని వేడుకోవడంతో మందుల చొక్కయ్య. మందుల మారయ్య అనే వారినీ సృష్టించి పంపగా అప్పటికే విషప్రభవం వల్ల మరణ చివరి అంచుల్లో ఉన్న జనమయేయుడు ఆగ్రహంతో ఒరేయ్ మందులోల్లార ఆలస్యంగా వచ్చి నామరణనికి కారణమయిన మీరు కటిక పేదవారుగా జీవిస్తారని, మీ మెడలోని రత్నామనిమనిక్యలు పూసలు అయిపోవుగాక, మీఅశ్వాలు,గాడిదలు అయ్యిపోవునుగాక,మీరు ఊరికి కోసెడు దూరంలో జీవిస్తురుగాక అని జనమేజయ మహారాజు శపించాడు. ఆ శాపం కారణంగా మందుల కులం నాడు దీనావస్థలోకి దిగజరింది.