Jump to content

మత్స్య నారాయణ దేవాలయం (బెంగళూరు)

అక్షాంశ రేఖాంశాలు: 12°58′N 77°38′E / 12.967°N 77.633°E / 12.967; 77.633
వికీపీడియా నుండి
మత్స్య నారాయణ దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు12°58′N 77°38′E / 12.967°N 77.633°E / 12.967; 77.633
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగళూరు
ప్రదేశంబెంగళూరు
సంస్కృతి
దైవంశ్రీ మత్స్య నారాయణ (మత్స్య)
వాస్తుశైలి
నిర్మాణ శైలులుదేవాలయం
చరిత్ర, నిర్వహణ
వెబ్‌సైట్http://www.omkarhills.org/

శ్రీ మత్స్య నారాయణ దేవాలయం, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్న దేవాలయం.[1] బెంగుళూరు నగరంలోని ఓంకార్ హిల్స్ లో ఉన్న ఓంకర్ ఆశ్రమంలో[2] ఈ దేవాలయం ఉంది.

ప్రాముఖ్యత

[మార్చు]

కర్ణాటక రాష్ట్రంలో శ్రీ మత్స్య నారాయణ స్వామికి ఉన్న ఏకైక దేవాలయం ఇది. హిందుమతం ప్రకారం, విష్ణుమూర్తి 10 అవతారాల్లో ఈ మత్స్యావతారము మొదటిది. మత్స్య అంటే సంస్కృతంలో 'చేప' అని అర్ధం.[3] మత్స్య అవతారం అనగా చేపల రూపంలోవున్న విష్ణువు అవతారం.[4] మొదటి యుగం (సత్య యుగం) చివరలో, పెద్ద వరద వచ్చి ప్రపంచం నాశనమైనప్పుడు మానవత్వాన్ని, వేదాలను కాపాడటానికి విష్ణుమూర్తి మత్స్య అవతారాన్ని ధరించాడు.[5]

ఉత్సవాలు

[మార్చు]

ఈ ఆలయంలో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12.30 వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 8 గంటల వరకు, సెలవు దినాలలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పూజలు నిర్వహించబడుతాయి. ప్రతిఏటా మత్స్య జయంతి సందర్భంగా చైత్ర శుక్ల పక్ష త్రిత్య (చైత్ర మాసం, మార్చి- ఏప్రిల్) చంద్రకాలం మూడవ రోజు) రోజున ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి.

మూలాలు

[మార్చు]
  1. "Matsya Narayana Temple Bangalore". Retrieved 7 February 2021.[permanent dead link]
  2. "Omkar Ashrama - Omkara Hills". Retrieved 7 February 2021.
  3. "Matsya Purana complete". dharmakshetra.com. Archived from the original on 20 February 2014. Retrieved 7 February 2021.
  4. "Manas: Indian Religions, Vishnu". sscnet.ucla.edu/. Retrieved 7 February 2021.
  5. Glucklich, Ariel (11 April 2008). "9 Maps and Myths in the Matsya Purana". The Strides of Vishnu : Hindu Culture in Historical Perspective: Hindu Culture in Historical Perspective. Oxford University Press. pp. 155–156. ISBN 9780199718252. Retrieved 7 February 2021.