మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్
Madurai S. Subramanya Iyer.jpg
వ్యక్తిగత సమాచారం
జననం1897
కన్నివాడి, తమిళనాడు
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు
వాయిద్యాలువయోలిన్

మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక వాయులీన విద్వాంసుడు.

విశేషాలు[మార్చు]

ఇతడు 1897వ సంవత్సరం తమిళనాడు రాష్ట్రానికి చెందిన కన్నివాడి గ్రామంలో జన్మించాడు.[1] ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని నైషదం సదాశివయ్య వద్ద నేర్చుకున్నాడు. వయోలిన్ వాద్యాన్ని కరూర్ చిన్నస్వామి అయ్యర్ వద్ద అభ్యసించాడు. ఇతడు వాయులీన విద్వాంసుడిగా పేరుగడించినప్పటికీ స్వరకర్తగా కూడా కొన్ని వర్ణాలను ఇతడు రచించాడు. త్యాగరాజ పరంపరకు చెందిన ఇతడు అరుదైన స్వరాలకు రాగాలను సమకూర్చాడు. ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, మద్రాసులోని కళాక్షేత్రలలో ప్రొఫెసర్‌గా సంగీతం బోధించాడు. ఇతని కుమారుడు ఎం.ఎస్.సదాశివం ఆకాశవాణిలో పనిచేశాడు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతడి కృషిని గుర్తించి 1971లో కర్ణాటక సంగీతం వాద్యం (వయోలిన్) విభాగంలో ఇతనికి అవార్డును ఇచ్చింది.

మూలాలు[మార్చు]

  1. web master. "Madurai S. Subramanya Iyer". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 29 March 2021.