Jump to content

మను జోసెఫ్

వికీపీడియా నుండి
మను జోసెఫ్
జననం (1974-07-22) 1974 జూలై 22 (వయసు 50)
విద్యలయోలా కళాశాల, చెన్నై
వృత్తిపాత్రికేయుడు, రచయిత
పిల్లలు1

మను జోసెఫ్, కేరళకు చెందిన పాత్రికేయుడు, రచయిత. ఓపెన్ మ్యాగజైన్‌కు ఎడిటర్ గా పనిచేశాడు.

జననం, విద్య

[మార్చు]

మను 1974, జూలై 22న కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో జన్మించాడు.[1][2] చెన్నై నగరంలో పెరిగాడు. తండ్రి జోసెఫ్ మడపల్లి దర్శకనిర్మాత. అతడు తోరణం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మను చెన్నైలోని లయోలా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.

రచనారంగం

[మార్చు]

సొసైటీ మ్యాగజైన్‌లో స్టాఫ్ రైటర్‌గా చేరడంకోసం మద్రాస్ క్రిస్టియన్ కళాశాల చదువును మానేశాడు.[2] ఓపన్ మ్యాగజైన్‌కు సంపాదకుడిగా, ది ఇంటర్నేషనల్ న్యూయార్క్ టైమ్స్, ది హిందూస్తాన్ టైమ్స్‌లకు కాలమిస్ట్ గా పనిచేశాడు. 2007లో చెవెనింగ్ స్కాలర్ షిప్ అందుకున్నాడు.[3] ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు.[2] 2010లో రాసిన సీరియస్ మెన్ అనే తొలి నవల ది హిందూ లిటరరీ ప్రైజ్, పెన్/ఓపెన్ బుక్ అవార్డును గెలుచుకుంది. ఈ నవలను సుధీర్ మిశ్రా సినిమాగా తీశాడు.[4]

2012 సెప్టెంబరులో ఇతని రెండవ నవల, ది ఇల్లిసిట్ హ్యాపీనెస్ ఆఫ్ అదర్ పీపుల్ ప్రచురించబడింది.[5] 2009లో లవ్ ఖిచ్డీ పినిమాకు స్క్రీన్ ప్లే కూడా రాశాడు.[6]

2014 జనవరిలో, ఓపెన్ మ్యాగజైన్ ఎడిటర్ పదవికి రాజీనామా చేశాడు.[7]

మను 2021 డిసెంబరు 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన భారతీయ ఆంగ్ల-భాషా కామెడీ వెబ్ సిరీస్ ను రూపొందించాడు.[8]

అవార్డులు, సన్మానాలు

[మార్చు]
  • 2010: సీరియస్ మెన్ కు ది హిందూ లిటరరీ ప్రైజ్[9][10]
  • 2010: సీరియస్ మెన్ కు మ్యాన్ ఏషియన్ లిటరరీ ప్రైజ్ లో షార్ట్‌లిస్ట్ చేయబడ్డాడు[11]
  • 2010: సీరియస్ మెన్ కు హఫింగ్టన్ పోస్ట్ 10 ఉత్తమ పుస్తకాలు[12]
  • 2011: సీరియస్ మెన్ కు బోలింగర్ ఎవ్రీమాన్ వోడ్‌హౌస్ ప్రైజ్ లో షార్ట్‌లిస్ట్ చేయబడ్డాడు[13]
  • 2011: సీరియస్ మెన్ కు పెన్ ఓపెన్ బుక్ అవార్డు[14]
  • 2013: ది ఇల్లిసిట్ హ్యాపీనెస్ ఆఫ్ అదర్ పీపుల్ కు ది హిందూ లిటరరీ ప్రైజ్ షార్ట్‌లిస్ట్ చేయబడడ్డాడు[15]

మూలాలు

[మార్చు]
  1. "Manu Joseph". www.goodreads.com.
  2. 2.0 2.1 2.2 "About the Author". manujoseph.com. Archived from the original on 25 November 2011. Retrieved 15 November 2011. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "bio" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "Slimme mannen – Manu Joseph". literairnederland. Retrieved 15 November 2011.
  4. "Nawazuddin Siddiqui to star in Netflix's Serious Men, directed by Sudhir Mishra". Hindustan Times (in ఇంగ్లీష్). 3 June 2019. Retrieved 27 February 2022.
  5. "The Illicit Happiness of Other People (extracts)". The Hindu Prize. Retrieved 4 October 2012.
  6. "Extraordinary Minds, Ordinary Fathers". The New Indian Express. 8 July 2018. Retrieved 29 December 2018.
  7. "Manu Joseph resigns". Firstpost. Retrieved 9 June 2015.
  8. "'Decoupled' : The comedy of separation". The Hindu (in Indian English). 2021-12-07. ISSN 0971-751X. Retrieved 2022-02-21.
  9. Benedicte Page. "Manu Joseph's controversial tale of caste wins Indian literary prize", The Guardian, 2 November 2010.
  10. "Journalist's debut novel 'Serious Men' wins award" (3 November 2010). Mail Today (New Delhi). Retrieved 16 October 2012.
  11. "Manu Joseph Serious Men, 2010 Shortlist". The Man Asian Literary Prize. Archived from the original on 5 November 2011. Retrieved 15 November 2011.
  12. Shivani, Anis (9 November 2010). "Huffington Post Exclusive: The 10 Best Books Of 2010 (PHOTOS)". HuffPost (in ఇంగ్లీష్). Retrieved 27 February 2022.
  13. Maev Kennedy (12 April 2011). "Sam Leith and India Knight in running for Wodehouse book prize". The Guardian. Retrieved 9 November 2013.
  14. "Jacket Copy: PEN American Center's 2011 award winners". LA Times. 11 August 2011. Retrieved 9 November 2013.
  15. Staff writer (9 November 2013). "The Hindu Prize 2013 Shortlist". The Hindu. Retrieved 9 November 2013.

బయటి లింకులు

[మార్చు]