మను భాకర్

వికీపీడియా నుండి
(మను భకర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మను భాకర్
వ్యక్తిగత సమాచారం
జననం18 ఫిబ్రవరి 2002
గోరియా గ్రామం, జజ్జర్, హరియాణా.
క్రీడ
దేశంభారతదేశం
క్రీడషూటింగ్

మను భాకర్ ఎయిర్ గన్ షూటింగ్ లో భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడిన క్రీడాకారిణి. ఆమె 2018 ఐఎస్ఎస్ఎఫ్ (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) వరల్డ్ కప్‌లో భారతదేశం తరుపున ఆడి రెండు బంగారు పతకాలు సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే.[1] 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్ఠతికమైన అర్జున అవార్డుతో మను భాకర్‌ను సత్కరించింది.

వ్యక్తిగత జీవితం, నేపథ్యం

[మార్చు]

హర్యానా రాష్ట్రంలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన గోరియా అనే గ్రామంలో భాకర్ జన్మించింది. ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్. తల్లి స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేసేది. మను భాకర్ చిన్నప్పటి నుంచే షూటింగ్‌తో పాటు బాక్సింగ్, అథ్లెటిక్స్, స్కేటింగ్, జూడో కరాటే క్రీడల్లో పాల్గొనేది. కెరీర్ ఆరంభంలో పిస్టల్ తో ప్రజల మధ్య ప్రయాణించడం ఆమెకి ఒక సవాలుగా ఉండేది. ఎందుకంటే మైనరైన భాకర్ పిస్టల్ తీసుకొని ప్రయాణించడం చట్టరీత్యా నేరం. తన కుమార్తె షూటింగ్ పోటీలలో పాల్గొనడంలో సహాయ పడేందుకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు భాకర్ తండ్రి. లైసెన్స్ పొందిన పిస్టల్ తో ఆమె ప్రయాణిస్తున్నప్పుడు తోడుగా రావడం ప్రారంభించింది..[2] అత్యంత ఖరీదైన తుపాకులతో ఆడే ఆటను ఆడగలిగిందంటే అందుకు తన కుటుంబం అందించిన సహాయ సహకారాలే కారణమంటారు భాకర్. 2012 ఒలింపిక్స్ తరువాత నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యువ క్రీడాకారుల కోసం మొదలుపెట్టిన ఇండియా'స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షూటింగ్ ప్రోగ్రాం ద్వారా బేకర్ కు ప్రయోజనం కలిగింది. ఈ ప్రోగ్రాం వలన బాగా పేరుగాంచిన షూటర్లును యువకులకు వ్యక్తిగత కోచ్ లుగా నియమించే వ్యవస్థ వచ్చింది. భారత అత్యుత్తమ షూటర్ జస్పాల్ రాణా బేకర్ కి మార్గదర్శిగా నిలిచింది.[3]

వృత్తిపరమైన విజయాలు

[మార్చు]

2017 కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్ షిప్ లో భాకర్ 9 బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలుకొట్టింది. 2017లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భాకర్ రజత పతకం కైవసం చేసుకుంది.[1] 2018 మెక్సికోలోని గ్వాదలహరా నగరం వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్ షూటింగ్ వరల్డ్ కప్ లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోని ఫైనల్స్‌లో రెండుసార్లు ఛాంపియన్ గా నిలచిన అలెజాండ్రా జావ్లాను భాకర్ ఓడించింది.. ఈ విజయంతో భాకర్ వరల్డ్ కప్‌లో అతి చిన్న వయసులోనే బంగారు పతకం సాధించిన భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది.[2] 2018లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ లో భాకర్ రెండు స్వర్ణాలు సాధించింది..[3] అదే ఏడాది నిర్వహించిన కామన్ వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమె కేవలం బంగారు పతకం సాధించడం మాత్రమే కాదు.. ఆమె స్కోర్ తో కామన్ వెల్త్ గేమ్స్ లో కొత్త రికార్డు సృష్టించింది.. కేవలం 16వ ఏళ్ల వయసులోనే భాకర్ ఈ రికార్డు సాధించడం విశేషం.[4] మ్యూనిచ్ నగరంలో జరిగిన 2019 ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో 4వ స్థానంలో నిలిచి 2021లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.[1] 2020 ఆగస్టులో జరిగిన వర్ట్యువల్ ఈవెంట్ ద్వారా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Manu Bhaker clinches Tokyo Olympics quota in 10m air pistol". Wiki. Archived from the original on 2022-05-25. Retrieved 2023-02-09.
  2. 2.0 2.1 "'गोल्डन शूटर' मनु को कितना जानते हैं आप?". BBC News Hindi. Retrieved 2021-02-17.
  3. 3.0 3.1 Hawker, Peter (1830). Instructions to young sportsmen in all that relates to guns and shooting. London: Printed for Longman, Rees, Orme, Brown, and Green.
  4. "ISSF - International Shooting Sport Federation - issf-sports.org". www.issf-sports.org. Retrieved 2021-02-17.
  5. "National Sports Awards highlights: India's sporting best honoured in virtual ceremony". Hindustan Times. 2020-08-29. Retrieved 2021-02-17.
"https://te.wikipedia.org/w/index.php?title=మను_భాకర్&oldid=4299707" నుండి వెలికితీశారు